180ml

తెలుగులో నయనతార డైరెక్ట్ మూవీ ?

Nayanathara: తెలుగు చిత్రపరిశ్రమలో ఉన్న అన్ని నిర్మాణ సంస్థ‌ల్లో మైత్రీ మూవీస్‌(Mythri Movies) కు ఒక ప్రత్యేకమైన పేరును సంపాదించుకుంది. చిన్న, పెద్ద అనే తేడా లేకుండా అందరి హీరోలతో సినిమాలు తెరకెక్కిస్తోంది. అయితే ఈ మధ్యే చిత్ర నిర్మాణ విష‌యంలో కాస్త జోరు త‌గ్గించింది. ఇప్పుడు ఈ సంస్థ దృష్టంతా పుష్ప 2(Pushpa2)పైనే ఉంది. మిగిలిన సినిమాల గురించి ప‌ట్టించుకోవ‌డం లేదు. కొత్త క‌థ‌లను కాస్త దూరం పెట్టింది.

అయితే న‌య‌న‌తార‌తో మాత్రం ఓ లేడీ ఓరియెంటెడ్ సినిమాని నిర్మించాల‌న్న ఆలోచ‌న‌లో ఉంది. న‌య‌న‌తార‌కు త‌గిన క‌థ మైత్రీ మూవీస్ ద‌గ్గ‌ర సిద్ధంగా ఉంది. ఈ సినిమాని పాన్ ఇండియా స్థాయిలో నిర్మించాల‌న్న‌ది మైత్రీ ప్లాన్‌. ఇటీవ‌ల‌.. న‌య‌న‌తార‌తో సంప్ర‌దింపులు కూడా మొద‌లెట్టారు. న‌య‌న కూడా ఈ ప్రాజెక్టుపై ఆస‌క్తి చూపిస్తోంద‌ని టాక్‌. ఈ సినిమా కోసం న‌య‌న‌కు ఇప్ప‌టి వ‌ర‌కూ ఎవ్వ‌రూ ఇవ్వ‌నంత పారితోషికాన్ని మైత్రీ ఆఫ‌ర్ చేయ‌బోతోంద‌ట‌. క‌నీసం పారితోషికానికైనా న‌య‌న టెమ్ట్ అవుతుంద‌న్న‌ది మైత్రీ ఆశ‌. దాదాపుగా ఈ ప్రాజెక్ట్ ఓకే అయిపోయిన‌ట్టే. ద‌ర్శ‌కుడు ఎవ‌రు? ఏ జోన‌ర్‌లో ఈ క‌థ ఉండ‌బోతోంద‌న్న విష‌యాలు త్వ‌ర‌లో తెలుస్తాయి.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

YouTube
Instagram
Telegram
WhatsApp