Prabhas: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas) అంటే పడి సచ్చిపోయే అభిమానులు ఉన్నారు. తన కటౌట్ తో బాక్స్ ఆఫీస్ ను కట్టిపడేసే స్టామినా ఆయనది. అందుకే ప్రపంచవ్యాప్తంగా ఆయను కోట్లల్లో ఫ్యాన్స్ ఉన్నారు. ఇంత మంది ఉన్నా డార్లింగ్ కు ఇంకా అభిమానులు కావాలని అంటున్నారు. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా ఎక్కువమంది ప్రేక్షకులను అలరించడమే తన లక్ష్యమని చెప్తున్నారు. ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకునే సినిమా కథలను ఎంపిక చేసుకుంటా అని పేర్కొన్నారు.
సలార్ విజయవంతమైన సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ‘సలార్’ సీక్వెల్ (Salaar Part 2), తదుపరి ప్రాజెక్టుల గురించి చెప్పారు. ‘‘సలార్ 2’ స్క్రిప్టు పూర్తయింది. త్వరలోనే
షూటింగ్ మొదలు అవుతుందని చెప్పారు. ఈ సీక్వెల్ కోసం నా అభిమానులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని నాకు తెలుసు. మరికొన్ని రోజుల్లో ఈ ప్రాజెక్టు అప్‌డేట్స్ ఇస్తాం. నాకు విభిన్న నేపథ్య కథల్లో నటించాలనుంది. ప్రేక్షకుల నుంచి ‘సలార్’కు వచ్చిన స్పందనే నా తదుపరి సినిమాలకూ వస్తుందని ఆశిస్తున్నా. ప్రస్తుతం హారర్, సైన్స్ ఫిక్షన్ చిత్రాల్లో నటిస్తున్నా అని వివరించారు.


