Devara: డైరెక్టర్ కొరటాల శివ(Koratala Shiva), జూనియర్ ఎన్టీఆర్(NTR) కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం దేవర(Devara). అభిమానులు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న దేవర సినిమాకు సంబంధించిన గ్లింప్స్‌ను రిలీజ్ చేసేందుకు నిర్మాతలు సిద్ధం అయ్యారు. ఈ గ్లింప్స్‌ను జనవరి 8వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్టు ఓ ప్రోమోను రిలీజ్ చేశారు. ఈ ప్రోమోకు మంచి స్పందనతోపాటు ట్రోల్స్ కూడా భారీగానే కనిపించాయి. ఎన్టీఆర్ కూడా ఈ ప్రోమో పోస్టర్‌ను తన సోషల్ మీడియాలో పోస్టు చేశారు. గ్లింప్స్ రిలీజ్‌కు ముందు దేవర బిజినెస్ చర్చలు స్టార్ట్ అయ్యాయి. సినిమాపై భారీగా అంచనాలు పెట్టుకొన్న నిర్మాతలు భారీ రేటును డిస్టిబ్యూటర్లు, బయ్యర్ల ముందు ఉంచినట్టు తెలుస్తోంది. నిర్మాతలు చెప్పిన రేటు విన్న తర్వాత బయ్యర్లు వెనుకడుగు వేస్తున్నారు. అయితే ఆ రేంజ్‌లో బిజినెస్ కోట్ చేస్తే ఫలితం ఎలా ఉంటుందో, తీరా బెడిసికొడితే ఏంటి పరిస్థితి అనే ఆలోచనలో డిస్ట్రిబ్యూటర్లు ఆలోచిస్తున్నారని టాక్.
ఇదిలా ఉండగా, దేవర సినిమాకు సంబంధించి ఓవర్సీస్ థియేట్రికల్ రైట్స్ ధరను భారీగా నిర్ణయించారు. దాదాపు 30 కోట్ల వరకు కోట్ చేశారు. దాంతో బయ్యర్లు, డిస్టిబ్యూటర్లు ముఖం చాటేశారు. ఆ రేంజ్ ధరను పెట్టలేమని చెప్పారు. అయితే ఏ ఒక్క డిస్టిబ్యూటర్ కూడా నిర్మాతలు చెప్పిన ధరకు దరిదాపులో కూడా లేరు అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఈ నేపథ్యంలో దేవర గ్లింప్స్ ఒక్కటే సినిమాను కాపాడుతుంది అంటున్నారు. కొరటాల శివ ఆచార్య ఫలితమే ఈ తాజా పరిస్థితికి కారణం అని, అందుకే బయ్యర్లు, డిస్టిబ్యూటర్లు, ఎగ్జిబ్యూటర్లు వెనకడుగు వేస్తున్నారని ట్రేడ్ పండితుల అంచన.


