180ml

సంక్రాంతి కానుకగా విశ్వంభర

Chiranjeevi: సంక్రాంతి ముగిసింది. చాలా సినిమాలు విడుదలయ్యాయి. అందులో కొన్ని హిట్లు కొట్టాయి. మరికొన్ని యావరేజ్ టాక్ తెచ్చుకున్నాయి. గత సంవత్సరం వరుస సినిమాలతో అలరించిన చిరంజీవి ఈ సంవత్సరం భోళాశంకర్ తో పలకరించాడు. కానీ సంక్రాంతి బరిలో నిలవలేదు. అయితే వచ్చే సంక్రాంతికి కచ్చిటంగా వస్తున్నా అంటున్నారు. గురి పెట్టారు చిరంజీవి. ‘విశ్వంభ‌ర‌’ని వ‌చ్చే సంక్రాంతికి విడుద‌ల చేసే ప్లాన్ లో ఉంది చిత్ర‌బృందం. ఈ విష‌యాన్ని ఇటీవ‌ల విడుద‌ల చేసిన కాన్సెప్ట్ టీజ‌ర్‌లోనే స్ప‌ష్టం చేసింది. పెద్ద సినిమా క‌దా, అని సంక్రాంతి బ‌రిలో దింప‌డం లేదు. నిజంగానే క‌థ‌లో కూడా సంక్రాంతి వైబ్స్ ఉన్నాయి.

Mega156-3

ఈ సినిమాలో చిరంజీవి భీమ‌వ‌రం దొర‌బాబుగా క‌నిపించ‌బోతున్నాడు. భీమ‌వ‌రం అంటే సంక్రాంతి వైభోగం గుర్తొస్తుంది. అక్క‌డ కోడిపందాలు బాగా ఫేమ‌స్‌. పేకాట రాయుళ్ల‌కు కొద‌వ ఉండ‌దు. ఆ వాతావ‌ర‌ణం అంతా.. ఈ సినిమాలో క‌నిపించ‌బోతోంద‌ని టాక్. ఈ సంక్రాంతికి వ‌చ్చిన ‘నా సామిరంగ‌’ కూడా ఇదే థియ‌రీ ఫాలో అయ్యింది. సినిమా అంతా సంక్రాంతి వాతావ‌ర‌ణం క‌నిపిస్తూ ఉంటుంది. ఈ సినిమా విజ‌యంలో ఆ పండ‌గ వైబ్స్ కూడా భాగం అయ్యాయి. అదే ఫార్ములా ‘విశ్వంభ‌ర‌’లో క‌నిపించ‌బోతోంది. వాటికి సంబంధించిన స‌న్నివేశాల‌న్నీ భీమ‌వ‌రం త‌దిత‌ర ప్రాంతాల్లోనే తెర‌కెక్కిస్తారు. ఫిబ్ర‌వ‌రి మొద‌టి వారంలో హైద‌రాబాద్ లో కొత్త షెడ్యూల్ మొద‌లు కానుంది. ఇందుకోసం హైద‌రాబాద్‌లో ఓ ప్ర‌త్యేక సెట్ తీర్చిదిద్దుతున్నారు. ఇందులోనే సింహ‌భాగం షూటింగ్ పూర్తి కానుంది. ఈ షెడ్యూల్ లో చిరంజీవితో పాటు త్రిష కూడా సెట్లో అడుగు పెట్ట‌బోతున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

YouTube
Instagram
Telegram
WhatsApp