Ravi Teja: సంక్రాంతికి గుంటూరు కారం(Gunturu Karam), సైంధవ్(Saindhav), నా సామీ రంగా(Naa Samiranga)తో పాటు రవితేజ ఈగల్(Eagle) చిత్రంతో పోటీపడుతుండగా.. ఈ నలుగురు హీరోలతో కుర్ర హీరో తేజ సజ్జా హనుమాన్(Hanuman) సినిమాతో వస్తున్నాడు. ప్రస్తుతం ఈ ఐదు సినిమాల మేకర్స్ థియేటర్లు సెట్ చేసుకోవడంలో బిజీగా ఉన్నారు. అయితే.. థియేటర్ల సమస్య వల్ల జనవరి 13 నుంచి ఈగల్ వెనకడుగు వేసే ఛాన్స్ ఉందని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.
లేటెస్ట్‌గా ఈగల్ సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకుంది. ఈ సినిమాకు సెన్సార్ బోర్డ్ యూ/ఏ సర్టిఫికేట్ ఇచ్చారని, అది కూడా ఎలాంటి కట్స్ లేకుండా ఇచ్చినట్లు మేకర్స్ తెలిపారు. అయినా కూడా ఈగల్ పోస్ట్ పోన్ అయ్యే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. ఈగల్ థియేటర్స్ సైంధవ్ మూవీకి కేటాయిస్తున్నట్టుగా సమాచారం. దీంతో సంక్రాంతికి ఈగల్ వస్తుందా? లేదా? అనేది డైలమాలో పడిపోయింది. రేపో మాపో ఈగల్ వాయిదా పై అఫిషీయల్ కన్ఫర్మేషన్ బయటికొచ్చే ఛాన్స్ ఉందంటున్నారు. ఒకవేళ ఈగల్ పోస్ట్‌పోన్ అయితే.. రిపబ్లిక్ డే సందర్భంగా రిలీజ్ కానుందని అంటున్నారు. దీనిపై అధికారిక ప్రకటన మాత్రం లేదు.


