Samantha: స్టార్ హీరోయిన్ సమంత(Samantha) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మయోసైటిస్ తో బాధపడుతున్న సామ్ కొంత కాలం నుంచి షూటింగ్ లకు విరామం ఇచ్చిన సంగతి తెలిసిందే. ట్రీట్ మెంట్ తీసుకోని ప్రస్తుతం సామ్ ఆరోగ్యంగానే ఉంది. ఈ నేపథ్యంలో సామ్ ఒక పోస్ట్ పెట్టింది. కొత్త సంవత్సరం రోజు తన అభిమానులకు ఓ గుడ్ న్యూస్ చెప్పింది. తన చుట్టూ ఉన్నవారిని చూసి స్ఫూర్తి పొందుతానని, సంవత్సరం అంతా రిలాక్సింగ్ గా సాగిపోవాలంది. ఈ సంవత్సరం తాను ఆరోగ్యంపై ఫోకస్ చేస్తానని, మళ్లీ వర్క్ లోకి వెళతానని, కచ్చితంగా తన లక్ష్యాలను చేరుకుంటానని ఆ పోస్ట్ లో రాసుకొచ్చింది. దీంతో సమంత తిరిగి సినిమాల్లోకి అడుగు పెట్టబోతోందని అందరికీ అర్థమైంది. ఇది తెలుసుకున్న సమంత(Samantha) అభిమానులు ఖుషీ అవుతున్నారు.
ఇటీవలే సమంత ఒక నిర్మాణ సంస్థను ప్రారంభించింది. పరిశ్రమలోకి కొత్తగా వచ్చేవారిని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో తన బ్యానర్ ద్వారా సినిమాలు, వెబ్ సిరీస్ లు నిర్మించనుంది. అందులో భాగంగానే బేబీ హీరోయిన్ వైష్ణవి చైతన్యకు కోటిరూపాయల పారితోషికంతో ఒక సినిమాను ఆఫర్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే దీనిపై అధికారికంగా ప్రకటన మాత్రం రాలేదు. సమంత స్నేహితులురాలు నందినిరెడ్డి దర్శకత్వంలో ఓ సినిమా చేయాల్సి ఉంది. మొదటి ఈ పాత్రలో వేరే హీరోయిన్ అనుకున్నారుకానీ కుదరకపోవడంతో సమంతను చేయమని అడిగారు. అందుకు ఓకే చెప్పిన సామ్ ఆ సినిమాలో జొన్నలగడ్డ సిద్ధు సరసన చేయాల్సి ఉంది.


