Mahesh Babu: త్రివిక్రమ్(Trivikram), మహేశ్ బాబు(Mahesh Babu) కాంబోలో వస్తున్న గుంటూరు కారం చిత్రానికి నెట్టింట్లో మాములు క్రేజ్ లేదు. ముఖ్యంగా కుర్చీని మడతపెట్టి సాంగ్ రిలీజ్ అయిన తర్వాత బజ్ పెరిగింది. అదే విధంగా సంక్రాతికి విడుదల కావడంతో మూవీపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. నిజానికి మహేశ్- త్రివిక్రమ్ కాంబో అనగానే బ్లాక్ బస్టర్ అని ఆడియన్స్ ఫిక్స్ అయిపోయారు. తాజాగా గుంటూరు కారానికి సెన్సార్ పూర్తి అయింది. ఈ విషయాన్ని తాజాగా చిత్ర యూనిట్ ట్వీట్ చేసింది.

మహేశ్ బాబు అనగానే అందరూ డీసెంట్ గా, స్టైలిష్ గా, స్మార్ట్ గా ఊహించుకుంటారు. కానీ, మహేశ్ ని ఫ్యాన్స్ మాస్ లుక్ లోనే చూడాలి అనుకుంటారు. అలాంటి ఒక ఊరమాస్ లుక్స్ తోనే గుంటూరు కారంలో మహేశ్ కనిపించబోతున్నాడు. అందుకే ఈ మూవీపై అంచనాలు ఆ స్థాయిలో పెరిగాయి. పైగా లుంగీ కట్టుకుని నడుచుకుంటూ వస్తున్న మహేశ్ కటౌట్ చూసి ఫ్యాన్స్ కి పూనకాలు వస్తున్నాయి. ఇక సెన్సార్ విషయానికి వస్తే బోర్డు ఈ మూవీకి U/A సర్టిఫికేట్ ఇచ్చింది. ఇంకేముంది జనవరి 12న థియేటర్లలో సెలబ్రేషన్స్ చేసుకోవడం, బాక్సాఫీస్ వద్ద గుంటూరోడి కలక్షన్స్ వేట మొదలవ్వడమే తరువాయి. ఇక సలార్ మూవీ రికార్డులను బద్దలు కొడుతుందా అనేది ఇప్పుడు లేటెస్ట్ హాట్ టాపిక్. శ్రీలీల, మీనాక్షి చౌదరి ఇద్దరూ హీరోయిన్లతో ఫుల్ లెంగ్త్ మాస్ ఎంటర్ టైనర్ గా వస్తున్న ఈ సినిమా ఏ రికార్డులను క్రియేట్ చేస్తుందో చూడాలి.


