180ml

మెగాస్టార్ తో మల్టీస్టారర్ ఎప్పుడంటే…?

Venkatesh: విక్టరీ వెంకటేశ్‌ ఫ్యామిలీ హీరో అని అందరికి తెలుసు, అయితే ఆయన సినిమాల్లో వైలెన్స్ కూడా నెక్ట్స్ లెవల్లో ఉంటుందని కొందరికి తెలుసు. ఇప్పుడు అందరికి తెలిసేలా ఆయన నటించిన 75వ చిత్రం సైంధవ్‌ (Saindhav). తండ్రీ కుమార్తెల సెంటిమెంట్‌తో శైలేశ్ కొలను దర్శకత్వంలో దీన్ని తెరకెక్కించారు. వెంకీకి జోడిగా శ్రద్ధా శ్రీనాథ్‌ నటిస్తోంది. తాజాగా విడుదలైన ట్రైలర్ అందరికి విపరీతంగా నచ్చింది. ఈ ఈవెంట్‌లో భాగంగా వెంకటేష్ మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఇందులో ఆసక్తికరమైన క్వశ్చన్ అడిగారు. చిరంజీవితో మల్టీస్టారర్ ఎప్పుడు ఉంటుంది అన్న ప్రశ్నకు వెంకీ సమాధానం ఇచ్చారు.

ఇది వరకే మహేష్ బాబు(Mahesh Babu)తో సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, పవర్ స్టార్ పవన్ కల్యాణ్(Pawan Kalyan) తో గోపాల గోపాల చిత్రాలు తెరకెక్కించారు. ఇదే సందర్భంలో మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi)తో సినిమా ఎప్పుడు ఎక్స్ పెక్ట్ చేయొచ్చు అనే ప్రశ్నకు బదులుగా మంచి స్క్రిప్ట్ కుదిరితే చేయడానికి ఇద్దరు ఎప్పుడూ సిద్ధంగానే ఉన్నట్లు పేర్కొన్నారు. ఈ సమాధానంతో మెగా అభిమానులు పండుగ చేసుకుంటున్నారు. ఎందుకంటే ఈ మధ్య చిరంజీవి కూడా ఎక్కువ మల్టీస్టారర్ పాత్రలు చేస్తున్నారు. ఇలాంటి స్టేట్ మెంట్ వెంకీ నుంచి రావడంతో.. అంతర్గతంగా మల్టీస్టారర్ చర్చలు నడుస్తున్నాయి అనే టాక్ వినిపిస్తోంది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

YouTube
Instagram
Telegram
WhatsApp