180ml

సైకోగా అదరగొట్టిన వెంకీ…!

విక్టరీ వెంకటేష్ (Venkatesh) హీరోగా నటించిన పాన్ ఇండియా సినిమా ‘సైంధవ్'(Saindhav). ‘హిట్’, ‘హిట్ 2’ చిత్రాల దర్శకడు శైలేష్ కొలను(Sailesh Kolanu) దర్శకత్వం వహించిన ఈ మూవీ వెంకీ 75వ సినిమాగా తెరకెక్కుతోంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన పాటలు (Songs), టీజర్స్(Teaser) సినిమాపై మంచి హైప్ క్రియేట్ చేశాయి. తాజాగా మూవీ ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు. తండ్రీ కుమార్తెల అనుబంధం నేపథ్యంలో వస్తున్న ఈ సినిమాలో యాక్షన్ సీన్స్ విపరీతంగా ఉంటాయని ఇందులో చూపించారు.

saindhav-16102023

3 నిమిషాల 36 సెకన్లుగా ఉన్న ఈ ట్రైలర్‌లో వెంకటేష్ కూతురు మా నాన్న సూపర్ హీరో అంటూ చెప్పుకువస్తుంది. మరోవైపు వెంకటేష్ కిరాతకంగా చంపుకుంటూ వస్తాడు. ఈ క్రమంలో పాప జబ్బు బారిన పడుతుంది. అది నయం కావాలంటే 17 కోట్ల విలువైన ఇంజెక్షన్ ఇవ్వాలి. దీంతో ఆ డబ్బులు కోసం వెంకీ ఏం చేశాడనేది సినిమా చూడాల్సిందే. ముఖ్యంగా సెటిల్డ్ యాక్టింగ్‌తో వెంకటేశ్ అదరగొట్టారని అర్థమవుతోంది.

ఇక సినిమాలో వెంకటేష్ సరసన ‘జెర్సీ’ ఫేమ్ శ్రద్ధా శ్రీనాథ్ నటించారు. బాలీవుడ్ యాక్టర్ నవాజుద్దీన్ సిద్ధిఖీ ఈ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అవుతున్నారు. ఇందులో ఆయన సైకో విలన్‌ పాత్ర చేశారు. వీరితో పాటు తమిళ హీరో ఆర్య, ఆండ్రియా, రుహానీ శర్మ తదితరులు నటించారు. నిహారికా ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై వెంకట్ బోయినపల్లి దీనిని నిర్మించారు. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో సంక్రాంతి కానుకగా జనవరి 13న సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల అవుతోంది.

BeFunky-collage_-_2023-03-22T121732

ఇక సంక్రాంతికి ఈ మూవీతో పాటు “గుంటూరు కారం”, “హనుమాన్”, “ఈగల్”, “నా సామిరంగ” చిత్రాలు కూడా పోటీలో ఉన్నాయి. ఇవే కాకుండా రెండు తమిళ చిత్రాలు కూడా విడుదలయ్యే ఛాన్స్ ఉంది. దీంతో ఈసారి సంక్రాంతి విన్నర్ ఎవరో అవుతారో వేచి చూడాలి.

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

YouTube
Instagram
Telegram
WhatsApp