180ml

మహేష్ బాబు ఫ్యాన్స్ కు క్లైమాక్స్ పూనకాలే

Mahesh babu: మహేశ్‌బాబు (Mahesh babu) త్రివిక్రమ్ కాంబినేషన్‌ లో తెరకెక్కుతున్న తాజా చిత్ర ‘గుంటూరు కారం’ (Guntur Kaaram). సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదలకు సిద్ధం అయింది. ఇప్పటికే మూడు పాటలు విడుదలై సోషల్ మీడియాలో దుమ్మురేపుతున్నాయి. ఈ తరుణంలో నిర్మాత నాగవంశీ (Naga Vamsi) మాటలు మరింత ఉత్సహన్ని ఇస్తున్నాయి. మహేశ్‌ అభిమానులతో సోషల్‌మీడియా వేదికగా నిర్మాత మాట్లాడారు.

gk

‘‘చాలా కాలం నుంచి మహేశ్‌తో సినిమా చేయాలనుకుంటున్నా. ‘గుంటూరుకారం’తో ఆ కల నెరవేరింది. సినిమా అద్భుతంగా వచ్చింది. తమన్‌ మ్యూజిక్‌ మరోస్థాయిలో ఉండనుంది. ఫస్టాఫ్‌ రీరికార్డింగ్‌ పూర్తైంది. సంక్రాంతికి పర్‌ఫెక్ట్‌ మూవీ ఇది. ఫసాఫ్ట్‌లో వచ్చే ఫైట్‌లో ఇద్దరు సూపర్‌స్టార్స్‌ను చూస్తున్న ఫీల్‌ కలుగుతుంది. చివరి 45 నిమిషాలు సినిమా అదిరిపోతుంది. తెలుగు రాష్ట్రాల్లో ఎక్స్‌ట్రా షోల కోసం ప్రయత్నిస్తున్నాం. థియేటర్ల లిస్ట్ ఇంకా ఫైనల్‌ కాలేదు’’ అని ఆయన చెప్పారు. త్రివిక్రమ్‌ – మహేశ్‌ హ్యాట్రిక్‌ చిత్రమిది. శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటిస్తున్న విషయం తెలిసిందే.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

YouTube
Instagram
Telegram
WhatsApp