180ml

ఇందుకేనేమో ఆయన మెగాస్టార్ చిరంజీవి.!

Chiranjeevi: సినిమా ఇండస్ట్రీలో ఒక్కడిగా వచ్చి తనకంటూ ప్రత్యేక గుర్తింపు సాధించి ఇండస్ట్రి శిఖరంపై కూర్చున్న రారాజు మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi). ఆయన ఎప్పుడు గుంపులో గోవిందం లాగా లేడు. ఆయనకంటూ ప్రత్యేకమైన స్టైల్, మ్యానరిజమ్ లాంటివి ఉంటాయి. అహర్నిశలు కష్టపడడం ఆయన లక్షణం. మెగాస్టార్ చిరంజీవి ఇప్పటికిి కూడా పరిశ్రమకు వచ్చిన తొలినాళ్లలో కష్టపడినట్లు కష్టపడుతుంటారని చాలా సందర్భాల్లో డైరెక్టర్లు, సినిమా ప్రముఖులు చెప్పారు. అందుకే ఆయన ఎప్పటికి విజయం సాధిస్తూనే ఉంటారు.

25 సంవత్సరాల వయసులో ఎలా నటిస్తారో ఇప్పుడు కూడా అదే విధంగా నటిస్తారు చిరు. ఈ వయసులో కూడా నటన మీద ఏ మాత్రం నిర్లక్ష్యం వహించకుండా నటిస్తారు. ఎంతో ఉత్సాహంగా షూటింగ్ లలో పాల్గొంటూ బిజీ బిజీగా ఉంటారు మెగాస్టార్. అయితే కొన్ని సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో కొనసాగుతూ.. సీనియర్ స్టార్ హీరోగా ఎదిగిన చిరు ఇప్పుడు కూడా వరుస సినిమాల్లో నటించడం యంగ్ హీరోలకు కష్టమే అని చెప్పాలి. అయితే ఈ యంగ్ హీరోలు చిరును చూసి కొన్ని నేర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన అభిమానులు కామెంట్స్ చేస్తుంటారు.

ఒకే సంవత్సరంలో ఒక సినిమాకు మించి మరో సినిమా చేయడం లేదు యంగ్ హీరోలు. కానీ చిరంజీవి మాత్రం ఒకే సంవత్సరంలో రెండు మూడు సినిమాలు చేస్తున్నారు. తొందర పడతున్నారు అనుకున్నా కూడా.. ఆయన సినిమాలు సూపర్ హిట్ అవుతున్నాయి. ఏదొ ఒక సినిమా మాత్రమే ఆవరేజ్ టాక్ ను సొంతం చేసుకుంటుంది. మిగిలిన సినిమాలు సూపర్ సక్సెస్ ను అందుకుంటున్నాయి. ఇక ఈ విధంగా యంగ్ హీరోలు ఇప్పటికీ కూడా రెండు మూడు సినిమాల్లో నటించలేకపోతున్నారు. ఈ విధంగా యంగ్ హీరోలు కూడా చిరును ఆదర్శంగా తీసుకుంటే బాగుండని కోరుకుంటున్నారు చిరు అభిమానులు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

YouTube
Instagram
Telegram
WhatsApp