180ml

ఈ సంక్రాంతికి గట్టిగా కొడుతున్నాం;nagarjuna

నాగార్జున హీరోగా విజయ్ బిన్ని దర్శకత్వంలో ‘నా సామిరంగ’ సినిమా రూపొందింది. శ్రీనివాస చిట్టూరి నిర్మించారు. ఎమ్ఎమ్ కీరవాణి సంగీతాన్ని అందించారు. ఈ నెల 14వ తేదీన ఈ సినిమాను భారీస్థాయిలో విడుదల అవుతుంది. ఈ నేపథ్యంలో హైదరాబాదులోని జేఆర్సీ కన్వెన్షన్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.

MV5BOWE5YjhiM2YtNDhmMi00MzgxLWI2YzItYjcwNTJiZDY4MGQ0XkEyXkFqcGdeQXVyMTU0OTAzMDcw._V1lm40Yie

నాగార్జున … అల్లరి నరేశ్ … రాజ్ తరుణ్ జోడీగా నటించిన, ముగ్గురు కథానాయికలు ఈ స్టేజ్ పై అందాల సందడి చేశారు. ఈ వేదికపై నాగార్జున మాట్లాడుతూ .. “సంక్రాంతి అంటే సినిమా పండగ. ఈ పండగ రోజున నాలుగు సినిమాలు వచ్చినా చూస్తారు. ఈ సంక్రాంతికి వస్తున్న వెంకటేశ్ కీ .. మహేశ్ బాబుకి .. తేజ సజ్జాకి ఆల్ ది బెస్ట్ చెబుతున్నాను” అన్నారు.

‘నా సామిరంగ’ సినిమా విషయానికి వస్తే, నాన్నగారి ఆశీస్సులతో ఈ సినిమా చేశాను. ఇక కీరవాణి గారు ఎప్పటికప్పుడు మమ్మల్ని ముందుకు తీసుకుని వెళుతూ వచ్చారు. ఈ సినిమాను 3 నెలల్లో తీశాము. అందుకోసం మేము ఎంత కష్టపడ్డామనేది ఇప్పుడు కాదు .. సక్సెస్ మీట్లో చెబితేనే బాగుంటుంది. పడిన కష్టం గురించి అది ఫలించిన తరువాత మాట్లాడుకుంటేనే బాగుంటుంది కదా. ఈ సారి పండక్కి కిష్టయ్య వస్తున్నాడు .. బాక్సాఫీస్ కొడుతున్నాడు..’ అంటూ అభిమానులను హుషారెత్తించారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

YouTube
Instagram
Telegram
WhatsApp