180ml

ట్వీట్ ఓకే.. వార్ అప్డేట్ ఎప్పుడు?

ఇండియన్ సినిమా హిస్టరీలోనే బిగ్గెస్ట్ మల్టీస్టారర్‌గా వార్ 2 సినిమా నిలవబోతోంది. అసలు హృతిక్ రోషన్, ఎన్టీఆర్ కాంబినేషన్లో మల్టీస్టారర్ సినిమా వస్తుందని ఎవ్వరు ఊహించలేదు. కానీ ఈ స్పై యూనివర్స్‌ అనౌన్స్మెంట్‌తోనే సంచలనం క్రియేట్ చేసింది యశ్ రాజ్ ఫిలింస్. పైగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ విలన్‌గా చేస్తున్నాడంటే.. మాటలు కాదు. జై లవ కుశ సినిమాలో ఎన్టీఆర్ చేసిన నెగెటివ్ రోల్‌ జస్ట్ శాంపిల్ మాత్రమే. కానీ వార్ 2లో విశ్వరూపం చూపించబోతున్నాడు ఎన్టీఆర్.

n55dmejo_warntr650_625x300_05_April_23

దర్శకుడు అయాన్ ముఖర్జీ ఎన్టీఆర్ క్యారెక్టర్‌ను పవర్ ఫుల్‌గా డిజైన్ చేసినట్టుగా బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయింది. త్వరలోనే యంగ్ టైగర్ ఎన్టీఆర్ షూటింగ్‌లో జాయిన్ అయ్యేందుకు రెడీ అవుతున్నారు. ప్రజెంట్ దేవర షూటింగ్‌తో బిజీగా ఉన్నాడు తారక్. ఇది కంప్లీట్ అవగానే వార్2 షూటింగ్‌లో జాయిన్ అవనున్నాడు. ఇదిలా ఉంటే.. జనవరి 10న హృతిక్ రోషన్ బర్త్ డే కావడంతో.. హ్యాపీ బర్త్ డే హృతిక్ సర్, బిగ్ చీర్స్ టు ఫైటర్.. అంటూ ట్వీట్ చేశాడు ఎన్టీఆర్. గతంలో ఎన్టీఆర్ బర్త్ డేకి కూడా హృతిక్ రోషన్ యుద్ధభూమి నీకోసం ఎదురు చూస్తోంది.. అంటు ట్వీట్ చేశాడు. ఇక్కడే అభిమానులు అప్డేట్ ఇవ్వండి అని కామెంట్లు చేస్తున్నారు. ఫైటర్ సినిమాలో హృతిక్ ను చూపించారు. సాంగ్స్ కూడా విడుదల చేస్తున్నారు. కానీ ఎన్టీఆర్ లుక్ ఎలా ఉంటుందో ఇప్పటి వరకు చూపించలేదు. దీంతో అభిమానులు ఇదే విషయాన్ని అడుగుతున్నారు. ఎన్టీఆర్ లుక్ కచ్చితంగా కొత్తగా ఉండబోతుంది అని ఆయన ఫ్యాన్స్ ఆశ పడుతున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

YouTube
Instagram
Telegram
WhatsApp