టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu: ) హీరోగా నటిస్తున్న తాజా చిత్రం గుంటూరు కారం. ఈ సంక్రాంతి కానుకగా రిలీజ్ కాబోతుంది. ఈ సినిమాలో ఆయనకు తల్లిగా రమ్యకృష్ణ నటించింది. గుంటూరు కారంలో తల్లి పాత్ర ఎంతో కీలకం అని ట్రైలర్ చూస్తే అర్థం అవుతుంది. కీర్తి కిరీటాలు అనే నవల ఆధారంగా ఆ పాత్ర డిజైన్ చేసినట్లు ఇన్సైడ్ టాక్. ఈ పాత్రలో రమ్యకృష్ణ నటించారు. చిన్నప్పుడే దూరం అయిన కొడుకు పాత్రలో మహేష్ బాబు(Mahesh Babu: ) చేశారు. వీరిద్దరిని తల్లీకొడుకులుగా సిల్వర్ స్క్రీన్‌పై చూడడానికి ముందే గతంలో వీరిద్దరు చేసిన రోమాంటికి సాంగ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
2004లో మహేష్ బాబు హీరోగా ఎస్.జె.సూర్య దర్శకత్వంలో ‘నాని’ సినిమా వచ్చింది. డిఫరెంట్ కాన్సెప్ట్ తో వచ్చిన ఈ సినిమాలో రమ్యకృష్ణ ఓ రొమాంటిక్ సాంగ్ లో ఉంటుంది. ‘మార్కండేయ’ అంటూ సాగే ఈ పాటలో బాబుకు ప్రేమ పాఠాలు నేర్పిస్తుంది. థియేటర్లో ఈ పాట ఉన్నప్పటికి బుల్లితెరపై డిలీట్ చేశారు. ఈ సాంగ్ యూట్యూబ్‌లో ఉంది. ఈ నేపథ్యంలో ఈ సాంగ్ వైరల్ అవడం విశేషం. సినిమాల్లో వారు చేసేవి పాత్రలే కాబట్టి దీన్ని ఎవరు పెద్దగా సిరీయస్‌గా తీసుకోవద్దని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. గతంలో ఎంతో మంది స్టార్లు ఇలాంటి సందర్భాలు ఎదుర్కొన్నారు అని అంటున్నారు. ఏది ఏమైనా గుంటూరు కారంపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. అతడు, ఖలేజా తరువాత మహేష్, త్రివిక్రమ్ కాంబినేషన్లో వస్తున్న సినిమా కావడంతో ఆయన ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు.


