గ్లోబల్ మెగాపవర్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) హీరోగా ఇప్పుడు మావెరిక్ దర్శకుడు శంకర్(Shankar) తో “గేమ్ చేంజర్”(Game Changer) అనే భారీ చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా కొనసాగుతుండగా ఈ చిత్రం తర్వాత చరణ్ 16వ సినిమాని దర్శకుడు బుచ్చిబాబు సానా(Buchibabu sana) తో చేయనున్న సంగతి తెలిసిందే. మరి ఈ చిత్రాన్ని మరింత గ్రాండ్ గా ప్లాన్ చేస్తుండగా ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ చరణ్ లుక్ కి సంబంధించి వినిపిస్తుంది.

దీని ప్రకారం చరణ్ ఓ స్టన్నింగ్ మేకోవర్ లోకి మారబోతున్నాడని తెలుస్తుంది. RRR తర్వాత మళ్ళీ చరణ్ ఈ చిత్రం కోసం తన బాడీ బిల్డప్ చేయడమే కాకుండా తన హెయిర్ స్టయిల్ కూడా చేంజ్ చేయబోతున్నాడు అని మెగా వర్గాలు చెబుతున్నాయి. దీనితో మరోసారి చరణ్(Charan) తనదైన మేకోవర్ తో ఆ సినిమాలో అదరగొట్టబోతున్నాడు అని చెప్పొచ్చు. ఇక ఈ చిత్రానికి ఏ ఆర్ రెహమాన్(AR Rehaman) సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే.


