180ml

ఈగల్ వాయిదా పడింది.. కొత్త డేట్ ఎప్పుడంటే…?

Raviteja: ఈగ‌ల్‌(Eagle) వాయిదా ప‌డింది. ఈనెల 13న రావాల్సిన ‘ఈగ‌ల్‌’ ఫిబ్ర‌వ‌రి 9కి వెళ్లిపోయింది. ఈ సంక్రాంతికి 5 సినిమాలు విడుద‌ల‌కు సిద్ద‌మైన నేప‌థ్యంలో ఓ సినిమా వెన‌క్కి వెళ్లాల‌ని గిల్డ్ కోరింది. కానీ ఎవ్వ‌రూ ఒప్పుకోలేదు. చివ‌రికి ‘ఈగ‌ల్’ త‌ప్పుకోవాల్సివ‌చ్చింది. ఏ సినిమా త‌ప్పుకొన్నా.. వాళ్ల‌కు సోలో రిలీజ్ అవ‌కాశం క‌ల్పిస్తామ‌ని గిల్డ్ హామీ ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. ఇప్పుడు ‘ఈగ‌ల్’ ఫిబ్ర‌వ‌రి 9 మీద ఫోక‌స్ చేసింది. ఆ రోజే ‘టిల్లు స్వ్కేర్‌’ విడుద‌ల అవుతోంది. ఇప్పుడు ఆ సినిమా మ‌రో రిలీజ్ డేట్ చూసుకోక త‌ప్ప‌డం లేదు.

eagalx55nXus

ఈగ‌ల్ వాయిదా ప‌డ‌డంతో ఈ సంక్రాంతికి 4 సినిమాలు బ‌రిలో నిలిచాయి. 12న ‘గుంటూరు కారం’, ‘హ‌నుమాన్‌’ వ‌స్తున్నాయి. 13న ‘సైంధ‌వ్‌’, 14న ‘నా సామిరంగ’ రెడీగా ఉన్నాయి. 12న రెండు సినిమాలు పోటీ ప‌డ‌కుండా, 11న ఒక సినిమా వ‌చ్చి ఉంటే, ఈ పండ‌క్కి ఎలాంటి గొడ‌వా ఉండ‌క‌పోదును. ‘ఈగ‌ల్’ వాయిదా ప‌డ‌డంతో ‘సైంధ‌వ్‌’కి అడ్వాంటేజ్ అయ్యింది. ఈ సినిమాకి సోలో రిలీజ్ ద‌క్కిన‌ట్టైంది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

YouTube
Instagram
Telegram
WhatsApp