180ml

సంక్రాంతి బరిలో సినిమాలు ఇవే!

Sankranthi Movies: స్రంక్రాంతి వచ్చిందంటే తెలుగు రాష్ట్రాల్లో అన్ని గ్రామాలు కళకళలాడతాయి. సినిమా థియేటర్లు కూడా సందడిగా మారతాయి. ఈ ఏడాది కూడా సంక్రాంతికి ప్రేక్షకులను అలరించేందుకు స్టార్ హీరోల సినిమాలు రెడీ అవుతున్నాయి. ఇక ఈ సంక్రాంతి బరిలో ఎవరెవరు ఉన్నారో చూద్దాం.

మహేశ్ బాబు, శ్రీలీల, మీనాక్షి చౌదరి కాంబినేషన్లో ఈ చిత్రం తెరకెక్కింది. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించారు. ఈ నెల 12న ఈ చిత్రం థియేటర్లలో విడుదల కాబోతోంది. హారిక, హాసిని క్రియేషన్స్ పతాకంపై సినిమాను నిర్మించారు. జగపతిబాబు, ప్రకాశ్ రాజ్, రమ్యకృష్ణ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు.

Mahesh-Babus-Guntur-Karam-Intense-Action-Begins

నాగార్జున, అషికా రంగనాథ్ కాంబినేషన్లో తెరకెక్కిన ఈ చిత్రంలో అల్లరి నరేశ్, రాజ్ తరుణ్ కీలక పాత్రలను పోషించారు. విజయ్ బిన్నీ దర్శకత్వం వహించారు. ఎంఎం కీరవాణి సంగీతాన్ని అందించగా శ్రినివాస చిట్టూరి దీనిని నిర్మించారు. ఈ నెల 14న ఈ చిత్రం విడుదల కాబోతోంది.

MV5BOWE5YjhiM2YtNDhmMi00MzgxLWI2YzItYjcwNTJiZDY4MGQ0XkEyXkFqcGdeQXVyMTU0OTAzMDcw._V1

వెంకటేశ్ 75వ సినిమాగా ఈ చిత్రం తెరకెక్కింది. కూతురు సెంటిమెంట్ తో తెరకెక్కిన ఈ చిత్రంలో శ్రద్ధా శ్రీనాథ్, నవాజుద్దీన్ సిద్దిఖీ, ఆర్య ప్రధాన పాత్రలను పోషించారు. శైలేశ్ కొలను దర్శకత్వం వహించగా… వెంకట్ బోయనపల్లి నిర్మాతగా వ్యవహరించారు. జనవరి 13న ఈ సినిమా విడుదల కాబోతోంది.

173455-whatsapp-image-2023-10-16-a

యువ హీరో తేజ సజ్జా కథానాయకుడిగా ఆంజనేయస్వామి కథ నేపథ్యంలో తెరకెక్కిన సినిమా హను-మాన్. ఒక సామాన్యుడు అసామాన్యమైన శక్తులను పొంది… చెడుపై ఎలా విజయం సాధించాడనేది ఈ సినిమా ప్రధాన కథ. జనవరి 12న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ చిత్రాన్ని ప్రశాంత్ వర్మ తెరకెక్కించారు. వీటిలో మీరు ఏ సినిమా చూడాలనుకుంటున్నారు.

MV5BYWUwMGFmODMtYmFhNy00YTJlLWFiZDMtZDMwM2Q3NGZkNTgxXkEyXkFqcGdeQXVyMTU4Mzg1OTU2._V1_FMjpg_UX1000

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

YouTube
Instagram
Telegram
WhatsApp