NTR: మాస్ హీరో ఎన్టీఆర్(NTR), కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం దేవర(Devara). సముద్రం బ్యాక్ డ్రాప్లో భారీ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతోంది. ఏప్రిల్ 5న దేవర పార్ట్ 1 రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఈ క్రమంలో జనవరి 8న దేవర ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్ చేయబోతున్నారు. ప్రస్తుతం దేవర ప్రపంచం ఎలా ఉండబోతుందోనని గ్లింప్స్ కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు నందమూరి అభిమానులు. గ్లింప్స్ రిలీజ్ టైం దగ్గర పడుతుండడంతో మరో మూడు రోజులు, రెండు రోజుల్లో దేవర వస్తున్నాడు అంటూ.. సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు ఫ్యాన్స్.

రోజుల నుంచి గంటలకు మారిన కౌంట్‌తో.. మరికొన్ని గంటల్లో దేవర తుఫాన్ తీరాన్ని తాకబోతోంది. లేటెస్ట్గా ఈ సినిమా ఆడియో రైట్స్‌ను ప్రముఖ మ్యూజిక్ లేబుల్ టీ సిరీస్ సంస్థ దక్కించుకున్నట్టుగా కన్ఫర్మేషన్ ఇచ్చారు మేకర్స్. దీనిపై టి సిరీస్ వారు ఎగ్జైటింగ్ పోస్ట్ కూడా పెట్టారు. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ సినిమా దేవర తో కొలాబరేట్ కావడం.. గర్వంగా ఉందన్నారు. ఈ సినిమాకు కోలీవుడ్ యంగ్ సెన్సేషన్ అనిరుధ్ మ్యూజిక్ అందిస్తున్నాడు. దీంతో.. అనిరుధ్ దేవరకు మాసివ్ గూస్ బంప్స్ ఆల్బమ్ ఇచ్చినట్టుగా మరోసారి హైప్ ఇచ్చారు మేకర్స్ ఇక దేవర గ్లింప్స్ బయటికి రావడమే లేట్.. రికార్డులు లేస్తాయ్ అని రచ్చ చేస్తున్నారు ఫ్యాన్స్.


