180ml

ఓటీటీకి వస్తున్న సూపర్ హిట్ మూవీ

ఓటీటీ ప్లాట్ ఫామ్స్ పెరిగాక అన్ని భాషా చిత్రాలకు ప్రాధాన్యత పెరిగింది. మాములుగానే తమిళ హీరో శివ కార్తికేయన్ కు తెలుగులో మంచి మార్కెట్ ఉంది. తాజాగా ఆయన హీరోగా రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా తాజాగా తెరకెక్కిన సైన్స్ ఫిక్షన్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ అయలాన్. ఇటీవల ఆడియన్స్ ముందుకి వచ్చిన ఈ మూవీ మంచి సక్సెస్ సొంతం చేసుకుంది. ఆర్ రవికుమార్ తెరకెక్కించిన ఈ మూవీని కోటపడి జె రాజేష్ గ్రాండ్ లెవెల్లో కెజెఆర్ స్టూడియోస్, ఫాంటమ్ ఎఫ్ ఎక్స్ స్టూడియోస్, ఆదిబ్రహ్మ ప్రొడక్షన్స్ సంస్థల పై నిర్మించారు. ఏ ఆర్ రహమాన్ సంగీతం అందించిన ఈ మూవీలో ఇషా కొప్పీకర్, భానుప్రియ, యోగిబాబు శరద్ కేల్కర్ తదితరులు కీలక పాత్రలు చేశారు.

uiyfdfvi

విషయం ఏమిటంటే, తాజాగా అయలాన్ ఓటిటి అఫీషియల్ రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేసారు. ప్రముఖ ఓటిటి మాధ్యమం సన్ నెక్స్ట్ లో ఈ మూవీ ఫిబ్రవరి 9న ఆడియన్స్ ముందుకి రానుంది. అయితే ఈ మూవీ పక్కాగా ఏ ఏ భాషల్లో అందుబాటులోకి వస్తుంది అనే దానిపై క్లారిటీ రావాల్సి ఉంది. నిజానికి కొన్ని లీగల్ సమస్యల కారణంగా అయలాన్ తెలుగులో రిలీజ్ కాలేదనేది తెలిసింది. మరి థియేటర్స్ లో ఆకట్టుకున్న ఈ మూవీ ఓటిటి ఆడియన్స్ ని ఏ స్థాయిలో మెప్పిస్తుందో చూడాలి.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

YouTube
Instagram
Telegram
WhatsApp