180ml

12th Fail: మరో రికార్డు సాధించిన 12th ఫెయిల్ మూవీ

12th Fail: ఐపీఎస్ ఆఫీసర్ మనోజ్ కుమార్ జీవిత కథా ఆధారంగా తెరకెక్కిన చిత్రం 12th ఫెయిల్. చిన్న సినిమాగా విడుదలై సంచలనమైన విజయాన్ని అందుకుంది. ఇక ఓటీటీలో విడుదల అయిన తరువాత ప్రేక్షకులకు మరింత చేరువైంది. తాజాగా ఈ చిత్రం అరుదైన రికార్డును సృష్టించింది. ఇంటర్నెట్ మూవీ డేటా బేస్‌లో(IMDB) టాప్ 50లో స్థానం సంపాదించుకుంది. ఎంతో మంది ప్రముఖులు ప్రశంసలు అందుకున్న ఈ చిత్రం ఐఎమ్‌బీడీలో 9.2 రేటింగ్ సంపాదించడం విశేషం. భారతదేశం నుంచి ఈ లిస్ట్‌లో ఉన్న ఒకే ఒక చిత్రంగా చరిత్ర సృష్టించింది. ఈ విషయంపై డైరెక్టర్ విధు వినోద్ చోప్రా స్పందించాడు. ఎంతో ఆనందంగా ఉందని ఈ క్షణం చనిపోయినా సంతోషమే అని తన సోషల్ మీడియా వేదికగా స్పందించారు.

Untitled-1-Recovered

ప్రపంచ సినిమాలను వెనక్కి నెట్టి టాప్ 50లో స్థానం సంపాదించుకున్న ఈ చిత్రంలో మనోజ్ పాత్రలో విక్రాంత్ మస్సె నటించారు. తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను మెప్పించాడు. 12వ తరగతి ఫెయిల్ అయిన మనోజ్ ఐపీఎస్ ఎలా సాధించాడు అనేది కథ. ఈ సినిమా రిజనల్ ఫిల్మ్ విభాగంలో ఇండిపెండెంట్‌గా ఆస్కర్ బరిలో పోటీపడుతుంది. ఈ చిత్రం యువతకు స్పూర్తి దాయకం అని బాలీవుడ్ యాక్టర్ బొమ్మక్ ఇరాని ప్రశంసించారు

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

YouTube
Instagram
Telegram
WhatsApp