180ml

లాంగ్ షెడ్యూల్ కంప్లీట్ చేసుకున్న కాజల్ అగర్వాల్ “సత్యభామ”…!

Kajal Agarwal : మన సౌత్ ఇండియా సినిమా దగ్గర మంచి క్రేజ్ అండ్ ఫాలోయింగ్ ఉన్న హీరోయిన్స్ లో స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్(kajal agarwal) కూడా ఒకరు. ఇక కాజల్ తన లైఫ్ లో మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసాక ఓ లీడ్ రోల్ లో నటిస్తున్న సినిమానే “సత్యభామ”(Sathyabama). ఈ చిత్రంలో కాజల్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ లో నటిస్తోంది. “సత్యభామ” చిత్రాన్ని అవురమ్ ఆర్ట్స్ పతాకంపై బాబీ తిక్క, శ్రీనివాసరావు తక్కలపల్లి నిర్మిస్తున్నారు. “మేజర్”(Major) చిత్ర దర్శకుడు శశికిరణ్ తిక్క సమర్పకులుగా వ్యవహరిస్తూ స్క్రీన్ ప్లే అందించారు. సుమన్ చిక్కాల దర్శకత్వం వహిస్తున్నారు.

గత నవంబర్, డిసెంబర్ లో శరవేగంగా షూటింగ్ జరుపుకుందీ సినిమా. “సత్యభామ” సినిమాకు సంబంధించిన భారీ షెడ్యూల్ ను కంప్లీట్ చేసినట్టుగా తెలుస్తుంది. 35 రోజుల పాటు సాగిన ఈ షెడ్యూల్ తో సినిమా చిత్రీకరణ 90శాతం పూర్తయ్యింది. ఈ షెడ్యూల్ లో హ్యూజ్ యాక్షన్ సీన్స్ చేసింది కాజల్ అగర్వాల్. ఫైట్ మాస్టర్ సుబ్బు ఆధ్వర్యంలో ఈ యాక్షన్ సీక్వెన్స్ లను తెరకెక్కించారు.

దీనితో కాజల్ గతంలో ఎప్పుడూ కనిపించని యాక్షన్ మోడ్(Mode) లో “సత్యభామ”లో కనిపించబోతోంది. కాజల్ ఎక్కడా కాంప్రమైజ్(Compromise) కాకుండా ఎంతో శ్రమించి ఈ యాక్షన్ సీక్వెన్సులు కంప్లీట్ చేసింది. సినిమాలో ఈ పోరాట ఘట్టాలు ప్రత్యేక ఆకర్షణ అవుతాయని టీమ్ నమ్ముతోంది. “సత్యభామ” బ్యాలెన్స్ షూటింగ్ కంప్లీట్ చేసి త్వరలోనే రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేయబోతున్నారు.

ఇక ఈ చిత్రానికి సాంకేతిక వర్గం – బ్యానర్: అవురమ్ ఆర్ట్స్, స్క్రీన్ ప్లే, మూవీ ప్రెజెంటర్ : శశి కిరణ్ తిక్క, నిర్మాతలు : బాబీ తిక్క, శ్రీనివాసరావు తక్కలపెల్లి, కో ప్రొడ్యూసర్ – బాలాజీ, సినిమాటోగ్రఫీ – జి విష్ణు, సంగీతం: శ్రీ చరణ్ పాకాల, పీఆర్ఓ: జీఎస్ కే మీడియా, దర్శకత్వం: సుమన్ చిక్కాల లు అందిస్తున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

YouTube
Instagram
Telegram
WhatsApp