Kota Bommali: శ్రీకాంత్(Srikanth) కీలక పాత్రలో జీఏ2 పిక్చర్స్ పతాకంపై రూపొందిన చిత్రం ‘కోట బొమ్మాళి పి.ఎస్’. (Kotabommali PS) వరలక్ష్మి శరత్‌కుమార్, రాహుల్ విజయ్, శివాని రాజశేఖర్ ముఖ్య పాత్రలో తెరకెక్కిన ఈ చిత్రం థియేటర్లో మంచి విజయం సాధించింది. ఈ చిత్రానికి తేజ మార్ని దర్శకత్వం వహించగా.. బన్నీ వాస్, విద్యా కొప్పినీడి నిర్మించారు.
నవంబరు 24న ప్రేక్షకుల ముందుకు వచ్చి బాక్సాఫీస్ వద్ద మంచి వసుళ్లను రాబట్టడమే కాకుండా విమర్శకుల ప్రశంసలు సైతం పొందింది. ఈ చిత్రం ఓటీటీలో ఎప్పుడు విడుదల అవుతుందా అని చాలా మంది సినిమా అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో మూవీ టీమ్ గుడ్ న్యూస్ చెప్పింది. జనవరి 11వ తేదీ నుంచి ‘కోట బొమ్మాళి పి.ఎస్.’ను ఓటీటీ ప్రేక్షకుల కోసం అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలుస్తుంది. ప్రముఖ ఓటీటీ సంస్థ ‘ఆహా’ ఈ విషయాన్ని తెలియజేస్తూ పోస్టర్‌ను విడుదల చేసింది.


