Mahesh Babu: మహేష్ బాబు – త్రివిక్రమ్ ల క్రేజీ కాంబోలో సంక్రాంతి బరిలో నిలిచిన చిత్రం‘గుంటూరు కారం’. బాక్సాఫీసు రికార్డులు బద్దలు కొట్టడాని రెడీ అయిపోయింది. ఈ సినిమా నుంచి విడుదల అయిన పాటలు తెగ వైరల్ అవుతున్నాయి. అదే విదంగా ప్రమోషన్స్ మొదలు పెట్టారు. అయితే ఈ నేపథ్యంలో రేపు హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేశారు. పోలీసులు ఆఖరి నిమిషంలో పర్మిషన్లు వెనక్కి తీసుకోవడంతో ఈవెంట్ వాయిదా పడింది. త్వరలోనే కొత్త వేదిక చెబుతామని, డేట్ ఫైనల్ చేస్తామని చిత్రబృందం ప్రకటించింది.

యూసుఫ్ గూడాలోని పోలీస్ గ్రౌండ్స్ లో ఈవెంట్ ప్లాన్ చేశారు. అక్కడ ఏర్పాట్లు కూడా మొదలెట్టారు. కానీ… అక్కడ పార్కింగ్ సమస్యలు ఉన్నాయి. పార్కింగ్ కోసం సమీపంలోని కోట్ల విజయభాస్కర్‌రెడ్డి స్టేడియంలో ఏర్పాట్లు చేసుకొంటే, ఈవెంట్ కి అనుమతి ఇస్తామని పోలీసులు చెప్పారు. కానీ.. ఆ అనుమతులు రాలేదు. దాంతో.. ఈవెంట్ ఆగిపోయింది. దీంతో అసలు ఈవెంట్ ఉంటుందా, లేదంటే నేరుగా ట్రైలర్ వదిలేస్తారా అనే అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఎందుకంటే సలార్ చిత్రానికి ఈవెంట్ లేకుంటానే నేరుగా విడుదల చేశారు.


