Mahesh Babu: సూపర్ స్టార్ మహేశ్ బాబు(Mahesh Babu), మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో వస్తున్నా గుంటూరు కారం చిత్రంపై ఎన్నో అంచనాలు ఉన్నాయి. ఇటీవలే ఈ సినిమా టాకీ పార్టును కూడా చిత్ర యూనిట్ దిగ్విజయంగా పూర్తి చేసేసుకుంది. సక్సెస్‌ఫుల్ కాంబినేషన్‌లో రూపొందుతోన్న ‘గుంటూరు కారం’ మూవీని సంక్రాంతి కానుకగా ప్రేక్షకులకు ముందుకు తీసుకు వచ్చేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది. అందుకు అనుగుణంగానే ఈ మూవీకి సంబంధించిన పనులన్నీ కంప్లీట్ చేస్తున్నారు. అదే సమయంలో ప్రమోషన్ కార్యక్రమాలను సైతం ముమ్మరం చేయాలని ప్లాన్లు చేస్తున్నారు.

పక్కా మాస్ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న ‘గుంటూరు కారం’ మూవీ విడుదలకు సమయం దగ్గర పడుతోన్న నేపథ్యంలో దీని గురించి ఎన్నో రకాల అంశాలు తెరపైకి వస్తున్నాయి. ఈ క్రమంలోనే ఈ సినిమా యద్దనపూడి సులోచనారాణి రాసిన ఓ నవల ఆధారంగా తెరకెక్కుతున్నట్లు ఓ న్యూస్ ఫిలిం నగర్ ఏరియాలో వైరల్ అవుతోంది.
తాజా సమాచారం ప్రకారం.. ‘గుంటూరు కారం’ మూవీ కథను త్రివిక్రమ్ శ్రీనివాస్.. యద్దనపూడి సులోచనారాణి రాసిన ‘కీర్తి కిరీటాలు’ నవల నుంచి తీసుకున్నట్లు తెలిసింది. కానీ, ఆ కథకు చాలా మార్పులు చేసి దీన్ని రూపొందించినట్లు సమాచారం.


