Chiranjeevi: చిరంజీవి సినిమా అంటే విందు భోజనంలా ఉండాలి. పిల్లల దగ్గర నుంచి పెద్దల దాకా అందరికీ నచ్చేలా ఉండాలి. పాటలు, డాన్సులు, ఫైట్లు, కథ, కథనం, కామెడీ అన్ని ఓ రేంజ్ లో ఉండాలి. మొత్తంగా ఓ చందమామ కథలా ఉండాలి. చిరంజీవిని జగదేకవీరుడుగా చూపిస్తేనే జనం ఇష్టపడతారు. అప్పుడే అది పూర్తిస్థాయి చిరంజీవి సినిమా. యువ దర్శకుడు వశిష్ట ఈ విషయాన్ని పూర్తిగా అవగతం చేసుకొని తయారు చేసుకున్న కథ విశ్వంభర(Vishvambhara).

అబ్బురపరిచే చందమామ కథలు ఈ సినిమా ఉంటుందని చిత్ర బృందం చెబుతోంది. చిరంజీవి గతంలో యముడికి మొగుడు, జగదేకవీరుడు అతిలోకసుందరి, అంజి వంటి ఫాంటసీ చిత్రాలు చేశారు. వాటిని మించిన స్థాయిలో ఊహించని మలుపులతో మరో లోకంలోకి తీసుకెళ్లేలా ఈ సినిమా ఉండబోతుందని సమాచారం. అందుకే అత్యుత్తమ సాంకేతిక నిపుణులు ఈ చిత్రానికి పని చేస్తున్నారు. సునీల్(Sunil) ప్రత్యేక పాత్రలో అలరించనున్నారు. ఈ చిత్రంలో చిరుకు జోడిగా కోలివుడ్ ముద్దుగుమ్మ త్రిష ఎంపికయ్యారు. కథకు అనుగుణంగా ఇంకొందరు కథానాయకులు ఈ సినిమాకు అవసరం అని మేకర్స్ చెబుతున్నారు. త్వరలేనే వారి వివరాలు అధికారికంగా ప్రకటిస్తారని తెలుస్తుంది. ప్రముఖ బాలీవుడ్ నటుడు ఈ సినిమాలో ప్రతి నాయకుడు పాత్ర పోషిస్తున్నారు. అలాగే డైలాగ్ రైటర్ సాయి మాధవ్ బుర్ర ఈ చిత్రానికి సంభాషణలు అందిస్తున్న విషయం తెలిసిందే.


