Amalapal: కోలివుడ్ హీరోయిన్ అమలాపాల్(Amalapal) గురించి అందరికీ తెలిసిందే. తాను సినిమాల్లోనే కాదు రియల్ లైఫ్ లో కూడా చాలా బోల్డ్. మొదట డైరెక్టర్ విజయ్ ని పెళ్లి చేసుకుంది. తరువాత విడాకులు తీసుకుంది. రీసెంట్ గా జగత్ దేశాయ్ ని రెండో వివాహం చేసుకుంది. కాగా, ఈ జంట ప్రస్తుతం పేరెంట్స్ కాబోతున్నారట. ఈ విషయాన్ని అమలాపాల్ స్వయంగా షేర్ చేసింది. సోషల్ మీడియా ద్వారా తమ మొదటి బిడ్డను ఆశిస్తున్నట్లు ప్రకటించింది. ఇద్దరూ తమ ప్రెగ్నెన్సీ ఫోటోషూట్ నుండి కొన్ని చిత్రాలను పంచుకున్నారు. నవంబర్ 5న కేరళలోని కొచ్చిలో అమల, జగత్ పెళ్లి చేసుకున్నారు. అయితే తాజాగా అమలా పాల్ ఇన్‌స్టాగ్రామ్‌లో “1+1 మీతో 3 అని ఇప్పుడు నాకు తెలుసు!” అని పోస్టు షేర్ చేయడం విశేషం.

అక్టోబర్ 26, 2023న అమలా పాల్ , జగత్ దేశాయ్ నిశ్చితార్థం చేసుకున్నారు. ఆమె పుట్టినరోజున అతను ఆమెకు పెళ్లి ప్రపోజ్ చేశాడు. ఈ నటి ప్రధానంగా మలయాళం , తమిళ చిత్రాలలో పనిచేసింది, అయితే రామ్ చరణ్ ‘నాయక్’ మరియు నాని ‘జండా పై కపిరాజు’ వంటి కొన్ని తెలుగు చిత్రాలలో కూడా భాగమైంది. నటి చివరిగా మమ్ముట్టి ‘క్రిస్టోఫర్’లో కనిపించింది. అజయ్ దేవగన్ ‘భోలా’ (కైతి రీమేక్)లో అతిధి పాత్ర పోషించింది. ఆమె పృథ్వీరాజ్ , దర్శకుడు బ్లెస్సీల చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న చిత్రం ‘ఆడుజీవితం’ విడుదల కోసం వేచి ఉంది. ఆమె పైప్‌లైన్‌లో ఆసిఫ్ అలీ ష్రాఫుదీన్ ‘లెవల్ క్రాస్’ కూడా ఉంది. కాగా, ఆమె పెట్టిన పోస్టుతో నెటిజన్లు, అభిమానులు .. శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.



