ప్రస్తుతం నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా దర్శకుడు బాబీ కొల్లి తో తన కెరీర్ లో 109వ సినిమాని అలాగే తన కెరీర్ లోనే మరో బిగ్గెస్ట్ యాక్షన్ డ్రామాగా ఇప్పుడు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాకి ముందు బాలయ్య కెరీర్ లో హ్యాట్రిక్ విజయాలు ఉండడంతో దీనితో మరో హ్యాట్రిక్ కి నాంది పలకాలి అని నందమూరి అభిమానులు ఆశిస్తున్నారు.

ఇక ఈ చిత్రం షూటింగ్ మేకర్స్ శరవేగంగా కంప్లీట్ చేస్తుండగా సినిమా రిలీజ్ కి సంబంధించి కూడా లేటెస్ట్ బజ్ ఒకటి వైరల్ గా మారుతుంది. దీని ప్రకారం మేకర్స్ ఈ చిత్రాన్ని మే రిలీజ్ కి తీసుకొస్తారని తెలుస్తుంది. మరి మే నెలలో ఎప్పుడు అనేది ఇంకా క్లారిటీ లేదు కానీ మే ఎండింగ్ కి అలా ప్లానింగ్ చూసినట్టు అయితే నెక్స్ట్ నెలలోనే బాలయ్య బర్త్ డే కూడా ఉంటుంది అది సినిమాకి ఫ్యాన్స్ కి అదనపు ప్లస్ అవుతుంది అని చెప్పవచ్చు. మరి చూడాలి మేకర్స్ ఎప్పుడు ఈ సినిమాని రిలీజ్ చేస్తారో అనేది.


