180ml

వాల్తేరు వీరయ్య రికార్డును ఎవరు టచ్ చేయలేరు.

Chiranjeevi: వాల్తేరు వీరయ్య(Valtair Veerayya)ను ఇంత సక్సెస్ చేసిన ప్రేక్షకులకు హీరో చిరంజీవి(Chiranjeevi) ధన్యవాదాలు తెలిపారు. ఈ సమయంలో ఈ చిత్రం క్రియేట్ చేసిన రికార్డును ఎవరూ అందుకోలేరని అన్నారు. 2023 సంక్రాంతి నుంచి 2024 సంక్రాంతి వరకు కృష్ణాజిల్లా అవనిగడ్డలోని రామకృష్ణ థియేటర్‌లో వాల్తేరు వీరయ్య ప్రదర్శిస్తుందంటే మాములు విషయం కాదని పేర్కొన్నారు. ఒక సంవత్సరం పాటు ఆడుతోందంటే.. మీరు నన్ను ఎంతలా అభిమానిస్తున్నారో అర్థమవుతోందని. ప్రేక్షకుల ప్రేమాభిమానాలకు ధన్యవాదాలు అని అన్నారు. ఈ రోజుల్లో ఇది ఎవరూ టచ్‌ చేయలేని రికార్డ్‌. దీనికి కారణం మీకు నచ్చేలా చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు బాబీ, సంగీత దర్శకుడు దేవిశ్రీ, నా తమ్ముడు రవితేజతోపాటు ఇతర తారాగణం, మైత్రి మూవీ మేకర్స్‌ సంస్థ అని తెలిపారు.

Valter1-min-276a88b0-885e-11ed-9b16-5b1b1e9f8842

గాడ్‌ఫాదర్‌ తర్వాత చిరంజీవి నటించిన చిత్రం వాల్తేరు వీరయ్య. యాక్షన్‌ ఫిల్మ్‌గా బాబీ కొల్లి తెరకెక్కించారు. శ్రుతిహాసన్‌ హీరోయిన్. రవితేజ, కేథరిన్‌, ప్రకాశ్‌రాజ్‌, బాబీ సింహా, కీలక పాత్రలు పోషించారు. సంక్రాంతి కానుకగా గతేడాది జనవరి 13న ఇది విడుదలైంది. చిరంజీవి ప్రస్తుతం ‘బింబిసార’ ఫేమ్‌ వశిష్ఠ దర్శకత్వంలో వర్క్‌ చేస్తున్నారు. సోషియో ఫాంటసీ మూవీగా ఇది సిద్ధం కానుంది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

YouTube
Instagram
Telegram
WhatsApp