180ml

సిద్ధూ, బొమ్మరిల్లు భాస్కర్ ప్రాజెక్ట్ లోకి “బేబి” హీరోయిన్

మన టాలీవుడ్ సినిమా దగ్గర మంచి టాలెంట్ కలిగిన అతి కొద్ది మంది యంగ్ హీరోయిన్స్ వైష్ణవి చైతన్య(Vaishnavi chaitanya) కూడా ఒకరు. మరి అప్పటివరకు పలు చిత్రాల్లో చిన్న చిన్న ముఖ్య పాత్రల్లో కనిపించిన తాను గత ఏడాది వచ్చిన లవ్ అండ్ ఎమోషనల్ చిత్రం “బేబి”(Baby) తో అయితే సాలిడ్ బ్రేక్ అందుకుంది. ఇక ఈ చిత్రంతో తనని తాను ప్రూవ్ చేసుకోగా ఈ సినిమా తర్వాత మరిన్ని ఆఫర్స్ ఆమెకి వచ్చాయి.

అలాగే ఇప్పుడు మరో సాలిడ్ ఆఫర్ ని ఆమె తన ఖాతాలో వేసుకుంది. రీసెంట్ గా అనౌన్స్ అయ్యిన ఒక క్రేజీ కాంబినేషన్ యంగ్ హీరో సిద్ధూ జొన్నలగడ్డ(siddu jonnalagadda) హీరోగా దర్శకుడు బొమ్మరిల్లు భాస్కర్(bhaskar) కాంబినేషన్ లో హీరోయిన్ గా ఇప్పుడు ఈమె ఫిక్స్ అయ్యినట్టుగా నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర వారు కన్ఫర్మ్ చేసారు. ఈరోజు ఆమె పుట్టినరోజు(Birthday) కానుకగా అయితే ఓ పోస్టర్ తో ఆమె లుక్ ని కూడా రివీల్ చేశారు. దీనితో ఈ ఇంట్రెస్టింగ్ కాంబినేషన్ లో తన పాత్ర ఎలా ఉంటుందో చూడాలి.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

YouTube
Instagram
Telegram
WhatsApp