180ml

హైదరాబాద్‌లో గేమ్ ఛేంజర్ – Ramcharan

Ramcharan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌(Ramcharan), స్టార్ డైరెక్టర్ శంకర్(Shankar) కాంబినేషన్లో వస్తున్న పవర్ ఫుల్ పొలిటికల్ యాక్షన్ డ్రామా గేమ్ చేంజర్(Game changer). ఇన్నాళ్లు ఇండియన్ 2 వల్ల ఈ సినిమా షూటింగ్ డిలే అవుతూ వస్తున్న విషయం తెలిసిందే. తాజా సమాచారం ప్రకారం.. ఇండియన్ 2 చిత్రంలో మరో రెండు పాటలు చిత్రీకరణ మాత్రమే బ్యాలన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రం వచ్చే ఏడాదిలో రిలీజ్‌ అయ్యే ఛాన్స్ ఉంది. కానీ గేమ్ చేంజర్ షూటింగ్ ఎప్పుడు కంప్లీట్ అవుతుందనే విషయంలో మాత్రం క్లారిటీ రావడం లేదు.

రీసెంట్‌గా దిల్ రాజు(Dil Raju) సమ్మర్‌లో ఈ సినిమాను రిలీజ్ చేసే ఛాన్స్ ఉందని చెప్పుకొచ్చాడు. కానీ షూటింగ్ ఎప్పుడు కంప్లీట్ అవుతుందనే విషయంలో ఎవరికి క్లారిటీ లేదు. ఆ మధ్య కొంత గ్యాప్ తర్వాత మైసూర్‌లో గేమ్ చేంజర్ షూటింగ్ మొదలు పెట్టాడు శంకర్. మరోవైపు ఇండియన్ 2 షూటింగ్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయినట్టుగా టాక్. కాబట్టి.. నెక్స్ట్ గేమ్ చేంజర్ షూటింగ్‌ పై ఫోకస్ చేయనున్నాడు శంకర్. ఈ నేపథ్యంలో.. గేమ్ చేంజర్ లేటెస్ట్ షెడ్యూల్‌ హైదరాబాద్‌లో స్టార్ట్ చేసినట్టుగా తెలుస్తోంది. గురువారం నుంచి ఈ కొత్త షెడ్యూల్‌ మొదలైంది. సినిమాలో కీ రోల్ ప్లే చేస్తున్న శ్రీకాంత్, సముద్రఖని, ఎస్‌జె సూర్య.. వారిపై కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నట్టు సమాచారం

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

YouTube
Instagram
Telegram
WhatsApp