180ml

ఈ సంవత్సరం విడుదలైన చిత్రాలు.. ఎన్ని హిట్టు? ఎన్ని ఫట్టు

2023Movies: సినిమారంగంలో(Movie Industry) సక్సెస్ రేటు చాలా తక్కువ అని అందరికీ తెలిసిందే. చిత్రం విడుదలైన మొదటి రోజు హిట్ కొట్టామనే హడావిడీ అందరిలో ఉంటుంది. ఆ వీకెండ్ గడిచిన తరువాత వర్కింగ్ డేస్ లో నిలబడే సినిమాల పర్సెంటేజ్ చాలా తక్కువ. స్టార్ హీరోలు ఈ ఏడాది పెద్దగా అలరించలేదనే చెప్పాలి. తెలుగులో నేరుగా రూపోందిన సినిమాలు 230 పైగా అయితే 70కి పైగా చిత్రాలు ఇతర భాషాల నుంచి అనువాదించారు. మొత్తం 300పైగా చిత్రాలు బాక్స్ ఆఫీస్ వద్ద విడుదల అయ్యాయి. కానీ అందులో నిర్మాతలకు లాభాలు తెచ్చిన పెట్టిన సినిమాలు వేళ్లమీద లెక్కపెట్టవచ్చు. మరీ ఈ సంవత్సరం విడుదలైన మూవీస్‌లో ఎన్ని చిత్రాలు హిట్ కొట్టాయో చూద్దాం.

ఈ నేపథ్యంలో బలగం(Balagam) సినిమా గురించి చెప్పుకోవాలి. పల్లెటూళ్లల్లో తెరలు కట్టి ప్రత్యేకంగా ఈ సినిమాని ప్రదర్శించారు. మన మూలాల్ని, కుటుంబ వ్యవస్థ గొప్పతనాన్ని చాటి చెబుతూ వేణు యెల్దండి తీసిన ఈ చిత్రంలోని భావోద్వేగాలు ప్రేక్షకుల్ని కట్టి పడేశాయి. దీనికంటే ముందు విడుదలైన రైటర్‌ పద్మభూషణ్‌ కూడా మంచి కథ ఉన్న చిత్రమే. క్రియేటీవ్ డైరెక్టర్ కృష్ణవంశీ రీమేక్‌ చేసిన ‘రంగమార్తాండ’ కూడా ప్రేక్షకుల్ని మెప్పించింది. కానీ వసూళ్లు రాబట్టలేకపోయింది. ఆ తరువాతా నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం దసరా. కీర్తి సురేష్ హీరోయిన్ గా సింగరేణి బొగ్గు గనుల నేపథ్యంలో సాగే చిత్రమిది. మంచి టాక్ తెచ్చుకుంది.

వేసవి చివర్లో ప్రభాస్‌(Prabhas) నటించిన ‘ఆదిపురుష్‌’ విడుదలైంది. భారీ అంచనాలతో విడుదలైనా ప్రేక్షకుల్ని నిరాశపరిచింది. మళ్లీ ప్రభాస్‌ ‘సలార్‌’తో ఊపిరి పీల్చుకున్నారు. ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వం వహించిన ‘సలార్‌’ ఇప్పటికే రూ.500కోట్లు వసూళ్లు సాధించింది. ఈ సంవత్సరంలో విడుదలైన ‘స్కంద’, ‘స్పై’, ‘టైగర్‌ నాగేశ్వరరావు’ విజయ్‌ దేవరకొండ ‘ఖుషి’ తదితర చిత్రాలు కూడా పాన్‌ ఇండియా మార్కెట్‌ని టార్గెట్‌ చేసినా ఫలితం లేదు.

చిరంజీవి(Chiranjeevi) ‘వాల్తేరు వీరయ్య’, బాలకృష్ణ ‘వీరసింహారెడ్డి’ చిత్రాలు సంక్రాంతి బరిలో నిలిచాయి. రెండు మంచి విజయాలనే అందుకున్నాయి. అలాగే దనుష్ నటించిన సార్ చిత్రం ప్రేక్షకులను మెప్పించింది. సంక్రాంతి తర్వాత బలమైన సీజన్‌ అంటే వేసవే. కానీ ఈ ఏడాది వేసవిలో పెద్దగా సినిమాలు రాలేదు. సాయిధరమ్‌ తేజ్‌ నటించిన ‘విరూపాక్ష’ మినహా ఏ చిత్రాలూ బాక్సాఫీస్‌ దగ్గర నిలబడలేదు. రవితేజ ‘రావణాసుర’, సమంత ‘శాకుంతలం’, గోపీచంద్‌ ‘రామబాణం’, నాగచైతన్య ‘కస్టడీ’, అల్లరి నరేష్ ఉగ్రం సినిమాలు వేసవిలోనే విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా పడ్డాయి.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

YouTube
Instagram
Telegram
WhatsApp