Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన ‘పుష్ప’ సినిమా, సంచలన విజయాన్ని అందుకుంది. ఆ సినిమా అల్లు అర్జున్ కి పాన్ ఇండియా ఇమేజ్ ను తెచ్చిపెట్టింది. దాంతో ‘పుష్ప 2’ సినిమాను పాన్ ఇండియా బడ్జెట్ రేంజ్ లో నిర్మిస్తున్నారు. దాదాపు 300 కోట్ల రూపాయల బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతుండగా, దేవిశ్రీ సంగీతాన్ని అందిస్తున్నాడు.
ఈ సినిమాకి సంబంధించిన ప్రతి అంశం నెక్స్ట్ లెవెల్లో ఉండేలా ప్లాన్ చేసుకుంటూ వెళుతున్నారని టాక్. ‘పుష్ప’ సినిమాలో యాక్షన్ సీన్స్ అన్నీ కూడా ఇక్కడే షూట్ చేశారు. అయితే ‘పుష్ప 2’ సినిమాకి సంబంధించిన ఒక యాక్షన్ సీన్ ను జపాన్ లో చిత్రీకరించనున్నారట. ప్రస్తుతం అందుకు సంబంధించిన సన్నాహాలు చేసుకుంటున్నట్టుగా తెలుస్తోంది.

కథ ప్రకారం పుష్ప ఒక భారీ డీల్ కోసం జపాన్ వెళ్తాడు. అక్కడ మాఫియా డాన్ తో డీల్ కుదరకపోగా, సీన్ రివర్స్ అవుతుంది. అక్కడి నుంచి పుష్ప బయటపడటమే కష్టమవుతుంది. ఈ సందర్భంలో .. మార్షల్ ఆర్ట్స్ తెలిసిన విలన్ గ్యాంగ్ తో బన్నీ తలపడే ఒక యాక్షన్ ఎపిసోడ్ ను డిజైన్ చేశారట. ఈ యాక్షన్ సీన్ ఈ సినిమా హైలైట్స్ లో ఒకటిగా నిలిచిపోతుందని అంటున్నారు. ఆగస్టు 15న ఈ సినిమా రిలీజ్ కానుంది.


