180ml

Prabhas: ప్రభాస్-మారుతి సినిమా పేరు ఇదే?

Prabhas: ప్ర‌భాస్ – మారుతి కాంబినేష‌న్లో ఓ సినిమా రూపుదిద్దుకొంటున్న సంగ‌తి తెలిసిందే. సంక్రాంతి సంద‌ర్భంగా ఈనెల 14న టైటిల్ రివీల్ చేయ‌బోతున్నారు. ఫ‌స్ట్ లుక్ కూడా విడుద‌ల చేస్తారు. ఈ సినిమాకి ‘రాజా సాబ్‌’ అనే టైటిల్ ఖాయ‌మైంది. 14న ఈ టైటిలే అధికారికంగా ప్ర‌క‌టిస్తారు. ఈ సినిమా కోసం ‘రాయ‌ల్‌’, ‘అంబాసిడ‌ర్‌’, ‘రాజా డీల‌క్స్‌’ లాంటి పేర్లు కూడా ప‌రిశీలించారు. చివ‌రికి ‘రాజా సాబ్‌’ కే చిత్ర‌బృందం ఓటేసింది. ఈమ‌ధ్య ప్ర‌భాస్ యాక్ష‌న్ ఓరియెంటెడ్ సినిమాల్లో ఎక్కువ‌గా క‌నిపిస్తున్నాడు. అయితే మారుతి.. ఈ సినిమాతో వింటేజ్ ప్ర‌భాస్‌ని మ‌ళ్లీ అభిమానుల‌కు ప‌రిచ‌యం చేయ‌బోతున్నాడు. ప్ర‌భాస్ క్యారెక్ట‌రైజేష‌న్ చాలా ల‌వ‌బుల్ గా ఉంటుంద‌ని టాక్‌.

 

‘బుజ్జిగాడు’, ‘డార్లింగ్’ త‌ర‌హా పాత్ర‌ల్లో ప్ర‌భాస్ ని చూడాల‌ని అభిమానులు ఎప్ప‌టి నుంచో అనుకొంటున్నారు. మారుతి సినిమాతో ఆ కోరిక నెర‌వేర‌బోతోంది. ఈ సినిమాతో మారుతి కూడా త‌న‌ని తాను కొత్తగా ఆవిష్క‌రించే ప్ర‌య‌త్నం చేస్తున్నాడు. ఇప్ప‌టికే తీసిన అవుట్ పుట్ పట్ల చిత్ర‌బృందం పూర్తి సంతృప్తితో ఉంది. ఓవైపు క‌ల్కికి కాల్షీట్లు ఇస్తూనే, మారుతి సినిమానీ పూర్తి చేస్తున్నాడు ప్ర‌భాస్‌. ఇటీవ‌ల సంజ‌య్‌ద‌త్ పై ఓ కీల‌క‌మైన ఎపిసోడ్ పూర్తి చేశారు. పండ‌గ హ‌డావుడి అయిపోయిన త‌ర‌వాత ప్ర‌భాస్ కూడా పూర్తి స్థాయిలో ‘రాజా సాబ్‌’కి కాల్షీట్లు కేటాయించ‌బోతున్నాడు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

YouTube
Instagram
Telegram
WhatsApp