ఏజెంట్ మూవీతో భారీ డిజాస్టర్ ఇచ్చాడు డైరెక్టర్ సురేందర్ రెడ్డి. దీంతో గత కొన్ని రోజులుగా ఆయన ఎక్కడా కనిపించలేదు. అయితే తాను మాత్రం మరో ప్రాజెక్ట్ సెట్ చేసుకునే పనిలో నిమగ్నమై ఉన్నారు. ఆ మధ్య పవన్ కల్యాణ్‌కు కూడా ఓ కథ వినిపించాడు. అది కూడా చేయాల్సి ఉంది. ఈలోగా పవన్ పవన్ రాజకీయాలతో బిజీగా ఉండడం వల్ల ఈ కాంబోకి బ్రేకులు పడ్డాయి. దాంతో మరో సినిమా చేయడానికి కథ సిద్ధం చేసుకున్నారు. చియాన్ విక్రమ్ కి ఓ కథ చెప్పాడు. ఆయనకు బాగా నచ్చింది వెంటనే ఓకే చెప్పాడు. స్టూడియో గ్రీన్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.

ఇటీవల విక్రమ్ కి ఫైనల్ నేరేషన్ ఇచ్చాడట సురేందర్ రెడ్డి. డైరెక్టర్ చెప్పిన కథతో విక్రమ్ ఇంప్రెస్ అయ్యాడని, ఈ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తెలుస్తోంది. స్క్రిప్టు పనులు కూడా ఓ కొలిక్కి వచ్చాయి. ఓ మంచి డేట్ చూసుకొని, ప్రాజెక్ట్ ని అధికారికంగా ప్రకటించడమే మిగిలివుంది. ఈ సినిమాలో చాలా ప్రత్యేకతలు ఉన్నట్టు తెలుస్తోంది. కథ పరంగా.. మరికొంత మంది క్రేజీ నటీనటులు ఈ సినిమాలో భాగం పంచుకోబోతున్నారు. వాళ్ల వివరాల్ని సైతం చిత్రబృందం ఎప్పటికప్పుడు ప్రకటించనుంది.


