Saindhav: ట్రెండ్ మారుతు ఉంటుంది. ఇప్పుడంతా తండ్రీ కూతుళ్ల సెంటిమెంట్ కథల హవా సాగుతుంది. నందమూరి బాలకృష్ణ, బ్యూటీఫుల్ హీరోయిన్ శ్రీలీల నటించిన భగవంత్ కేసరి ఈ తరహా సినిమానే. బాక్స్ ఆఫీస్ వద్ద మంచి వసుళ్లను సాధించింది. అయితే సినిమాలో వీరు నిజమైన తండ్రీ కూతుళ్లు కాకపోయినా వారి మధ్య అదే బాండింగ్ మాత్రం అదే. ఆ తరువాత సిద్ధార్థ్ హీరోగా చేసిన చిన్నా సినిమాలో అతను బాబాయ్ పాత్రలో నటించాడు. చిత్రంలో చిన్ను నాన్న లేకపోవడంతో సిద్ధార్థ్ తండ్రి స్థానంలోనే కనిపిస్తాడు. తమిళంలో ఆ సినిమా భారీ విజయాన్ని సాధించింది. అలాగే తెలుగులోనూ విమర్షకులు ప్రశంసలు అందుకుంది. అలాగే నేచురల్ స్టార్ నాని, బేబీ కియారా నటించిన హాయ్ నాన్న కూడా తండ్రీకూతుళ్ల నేపథ్యంలో వచ్చిన కథనే. ఈ సినిమా తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లోను మంచి లాభాలను రాబట్టంది.

తాజాగా వెంకటేశ్ హీరోగా చేసిన సైంధవ్ కూడా ఫాదర్ – డాటర్ మధ్య సాగే ఎమోషనల్ డ్రామానే. హిట్ సినిమాల దర్శకుడు శైలేశ్ కొలను దర్శకత్వం వహించిన ఈ సినిమా, ఈ నెల 13వ తేదీన విడుదల కానుంది. ఈ సినిమాలో వెంకటేశ్ కూతురుగా బేబీ ‘సారా పాలేకర్’ నటించింది. ఈ సినిమాలో ఆ పాపనే హీరో అని వెంకటేశ్ చెప్పడం గమనార్హం. ఈ తరహా కాన్సెప్టులతో తెరపై మళ్లీ చైల్డ్ ఆర్టిస్టులు పరిచయం అవుతున్నారు.


