180ml

అనుష్కతో క్రిష్ చిత్రం…!

Anushka: విలక్షణ దర్శకుడు క్రిష్ జాగర్లముడి(Krish Jagarlamudi) ప్రస్తుతం హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు సినిమాపై అన్ని ఆశలు పెట్టుకున్నారు. గత రెండు సంవత్సరాలుగా పట్టువదలని విక్రమార్కుడిలా ప్రయత్నిస్తున్నారు. కానీ అది ఎంతకు ఓ కొలిక్కి రావడం లేదు. ఇప్పుడు ఈ సినిమా అర్థాంత‌రంగా ఆగిపోయింది. అంటే మళ్లీ పవన్ కల్యాణ్ డేట్స్ దొరికితే ఫినిష్ చేస్తారు అదే వేరే విషయం అనుకోండి. ఈ లోపు దర్శకుడు క్రిష్ ఖాళీగానే ఉంటాడు. ఇక ఆయన చివరి సినిమా కొండపొలం. వైష్ణవ్ తేజ్, రకుల్ ప్రీత్ సింగి కాంబినేషన్‌లో తెరకెక్కిన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకుంది. తరువాత మళ్లీ బ్యాక్ టు హరిహరవీరమల్లు అన్నారు. ఇక ఏపీ ఎన్నికలు అయిపోతే గానీ ఈ సినిమా ముందుకెళ్లదు. దీంతో మరో సినిమా ప్లాన్ చేస్తున్నారు క్రిష్. యువ హీరోలంతా బిజీ, స్టార్ల డేట్స్ కష్టం అందుకే ఓ లేడీ ఓరియెంటెడ్ క‌థ సిద్ధం చేశాడు. దీనికోసం అనుష్క వైపు చూస్తున్నాడు క్రిష్.

krish-and-aushka

అనుష్క‌తో క్రిష్‌ రూపొందిన‌ వేదం ఇద్దరికి మంచి పేరు తీసుకొచ్చింది. ఇదిలా ఉంటే అనుష్క(Anushka) సినిమాల విష‌యంలో చాలా మొండిగా ఉంది. ఓ ప‌ట్టాన క‌థ‌లు ఒప్పుకోవ‌డం లేదని తెలుస్తోంది. పైగా సినిమాల‌పై ఆమెకు ఆస‌క్తి క్ర‌మంగా త‌గ్గిపోతోందని టాక్. మరీ ఇలాంటి సమయంలో క్రిష్‌తో సినిమా చేస్తుందా లేదా అన్నది మిలియన్ డాలర్స్ క్వశ్చన్. ఒక వేల ఒప్పుకుంటే తెరకెక్కిస్తాడు. లేదంటే టాలీవుడ్‌లో హీరోయిన్లే లేరా ఏంటి అనేది క్రిష్ ప్లాన్ బి. ఈ మేరకు స్క్రిప్ట్ సిద్దం చేసుకొని, నిర్మాత వేటలో పడితే ఆ తరువాత జరిగేది జరుగుతుంది. త్వరలోనే దీనికి సంబంధించి మరిన్ని విషయాలను క్రిష్ ప్రకటించే అవకాశం ఉంది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

YouTube
Instagram
Telegram
WhatsApp