180ml

గుంటూరు కారంలో కృష్ణ స్పెషల్…! MAHESH BABU

Mahesh Babu: ఈ సంక్రాంతి(Sankranthi) బరిలో మొత్తం 5 సినిమాలొస్తున్నాయి. అన్నింటిలో ప్రేక్ష‌కులు ఆత్రంగా ఎదురుచూస్తున్నది మాత్రం గుంటూరు కారం(Gunturu Karam) కోసమే. టాలీవుడ్ రికార్డుల్ని బ‌ద్దలు కొట్ట‌గ‌లిగే స‌త్తా ఉన్న సినిమా గుంటూరు కారం అని ట్రేడ్ వ‌ర్గాలు అంచ‌నా వేస్తున్నాయి. ఈ సినిమాలో సంక్రాంతి వైబ్ స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. మ‌హేష్ బాబు(Mahesh Babu) ఇది వ‌ర‌కెప్పుడూ చూడ‌ని మాస్ అవ‌తారంలో ద‌ర్శనం ఇవ్వబోతున్నారు. దానికి తోడు మాస్‌కి, మ‌హేష్ అభిమానుల‌కు న‌చ్చేలా మ‌రిన్ని ఐటెమ్స్ ఈ సినిమాలో పొందుప‌రిచేలా జాగ్ర‌త్త‌లు తీసుకొంటున్నారు డైరెక్టర్ త్రివిక్ర‌మ్‌. సోషల్ మీడియాలో ట్రెండ్ అయిన ‘కుర్చీని మ‌డ‌త‌పెట్టి’ లైన్ ను పాటలో పెట్టడం విమ‌ర్శ‌ల‌కు గురి అవుతున్నా.. మరో వైపు ఈ పాట మాస్‌లోకి బాగా వెళ్లిపోయింది. పండ‌గ రోజు, ఓ మాస్ థియేట‌ర్లో ఈ పాట‌ని చూస్తే… పూన‌కాలు రావ‌డం గ్యారెంటీ.

maxresdefault-4

దానికి తోడు గుంటూరు టాకీస్ సినిమాలో సూప‌ర్ స్టార్ కృష్ణ రిఫ‌రెన్సులు కూడా బోలేడు ఉన్నాయ‌ని తెలుస్తోంది. ఇది మహేష్ ఫ్యాన్స్ తో పాటు సూపర్ స్టార్ కృష్ణ ఫ్యాన్స్ కు కూడా ఎంతో ఉత్సాహాన్ని ఇచ్చే అప్డేట్. ఎందుకంటే ఆయన్ను గుర్తు చేసేలా కొన్ని సీన్లు డిజైన్ చేస్తే బొమ్మ బ్లాక్ బస్టర్ అని నమ్ముతున్నారు. గతంలో సంక్రాంతికి విడుదలైన సరిలేరు నీకెవ్వరు అనే సినిమా రిజల్ట్ చూశాము. ఇదే ఆలోచనను అమలు చేశారు త్రివిక్ర‌మ్. ఓ ఫైట్ సీన్‌లో కృష్ణ డైలాగ్ తో పాటు, పాట‌లోని బీజియ‌మ్‌ని కూడా ఉంటుందిని తెలుస్తోంది. అయితే ఆ డైలాగ్ ఏమిటి, ఆ పాటేమిటి అనేది చాలా సీక్రెట్‌గా ఉంది. ఈనెల 6న ‘గుంటూరు కారం’ ట్రైల‌ర్ రాబోతోంది. ఆ ట్రైల‌ర్‌లో ఏదైనా క్లూ ఉంటుందేమో చూడాలి.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

YouTube
Instagram
Telegram
WhatsApp