Nagarjuna: కింగ్ నాగార్జున(Nagarjuna:) హిట్ ప్లాపులతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. గతంలో వరుసగా హిట్లను సొంతం చేసుకున్న ఆయన.. ఈ మధ్య కాలంలో కాస్త తడబడుతున్నారు. అయినా అభిమానుల కోసం ప్రయత్నాలను మాత్రం ఆపడం లేదు. ఆయన రీసెంట్ గా చేసిన బంగార్రాజు సినిమా హిట్ టాక్ ను అందుకుంది. ఆ తర్వాత వచ్చిన ఘోస్ట్ అంతగా ఆడలేదు. ఈ నేపథ్యంలో తాజాగా నాగార్జున్ నటిస్తున్న చిత్రం ‘నా సామిరంగ’(Na Samiranga). ప్రముఖ కొరియోగ్రాఫర్ విజయ్ బిన్ని దర్శకత్వంలో ఫ్యామిలీ అండ్ మాస్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోంది. దీంతో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా రాబోతున్న ‘నా సామిరంగ’ మూవీ షూటింగ్ ఈ మధ్యనే ప్రారంభం అయింది. అప్పటి నుంచి ఏమాత్రం బ్రేకులు లేకుండా చిత్రీకరణ పూర్తి చేసుకుంది. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన విడుదల తేదీ వైరల్ అవుతుంది.

ఈ సినిమా షూటింగ్ ను పూర్తి చేసి సంక్రాంతికి విడుదల చెయ్యాలనేది మేకర్స్ ప్లాన్. ఈ క్రమంలో జనవరి 14వ తేదీన నా సామిరంగ విడుదల చేయబోతున్నరనేది తెలుస్తోంది. ఇంకా అధికారిక ప్రకటన విడుదల కాలేదు. గతంలో ‘బంగార్రాజు’ జనవరి 14న వచ్చి హిట్ అయింది. అలాగే, ‘సోగ్గాడే చిన్ని నాయన’ జనవరి 15వ వచ్చి సక్సెస్ అయింది. ఈ సెంటిమెంట్ ప్రకారం ఇది కూడా హిట్టే నాగార్జున అని ఫ్యాన్స్ అనుకుంటున్నారు. నా సామిరంగ’ మూవీని శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్నారు. ఇందులో అషికా రంగనాథ్ హీరోయిన్‌గా.. అల్లరి నరేష్, రాజ్ తరుణ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. కీరవాణి సంగీతాన్ని అందిస్తున్నారు.


