180ml

హనుమాన్ ఈవెంట్ కు మెగాస్టార్…!

Chiranjeevi: సంక్రాంతి పండుగ వస్తుందంటే అందరూ కొత్త సినిమాల కోసం వెయిట్ చేయడం సహజం. ఈ సంక్రాంతికి బాక్స్ ఆఫీస్ దగ్గర మరింత ఎక్కువ జోరే కనిపిస్తుంది. అందుకు తగ్గట్టుగానే వరుసబెట్టి స్టార్స్ తమ సినిమాలతో రంగంలోకి దిగుతూ ఉన్నారు. అయితే పిల్లలంతా కూడా ఈ నెల 12న రానున్న ‘హను మాన్'(Hanuman) సినిమాపై ఎక్కువ దృష్టి పెట్టారు.

gt4ew

సహజంగానే పిల్లలు సూపర్ హీరో కాన్సెప్ట్ తో కూడిన కథలను .. సినిమాలను ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. అలాంటి సూపర్ హీరోలకు ఆద్యుడు హనుమంతుడు కావడం .. ఆయన అనుగ్రహంతో హీరో వీరోచిత విన్యాసాలు చేయడమనే కాన్సెప్ట్ తో ఈ సినిమా రూపొందడం ప్రధానమైన కారణంగా చెప్పాలి.

ఇక ఈ సినిమాలో మెగా టచ్ కూడా కనిపిస్తుందని చెబుతూనే సస్పెన్స్ లో పెట్టారు. హనుమంతుడు అంటే మెగాస్టార్ కి చాలా ఇష్టమనే సంగతి తెలిసిందే. ఈ సినిమా నిర్మాత నిరంజన్ రెడ్డితోను ఆయనకి మంచి సాన్నిహిత్యం ఉంది. అందువలన ఈ నెల 7వ తేదీన జరగనున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ఆయన చీఫ్ గెస్టుగా రానున్నారు. అందువలన మేకర్స్ దీనిని ‘మెగా ప్రీ రిలీజ్ ఉత్సవ్’ గా పేర్కొంటూ, అధికారిక పోస్టర్ ను వదిలారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

YouTube
Instagram
Telegram
WhatsApp