180ml

దేవర షూటింగ్ అప్డేట్

ఎన్టీఆర్ – కొరటాల శివ కాంబినేషన్లో ‘దేవర’ రూపొందుతోంది. కల్యాణ్ రామ్ ఒక నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమా, ఒకదాని తరువాత ఒకటిగా షెడ్యూల్స్ ను పూర్తిచేసుకుంటూ వెళుతోంది. ఈ సినిమా అప్ డేట్స్ పట్ల అభిమానులు ఆసక్తితో ఉన్నారు. ఈ సినిమా షూటింగు ఎంతవరకూ వచ్చిందనే విషయం పట్ల కుతూహలంతో ఉన్నారు.

devara-poster-1

ఈ ప్రాజెక్టును సెట్స్ పైకి తీసుకుని వెళ్లిన దగ్గర నుంచి, పెద్దగా గ్యాప్ తీసుకోకుండా చకచకా షెడ్యూల్స్ ను చక్కబెడుతూ వచ్చారు. అందువలన చిత్రీకరణ పరంగా దాదాపు ముగింపు దశకి తీసుకుని వచ్చారు. ఈ సినిమా తాజా షెడ్యూల్ ను మార్చి 14వ తేదీ నుంచి ప్లాన్ చేసినట్టుగా తెలుస్తోంది. ఈ షెడ్యూల్ తో కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరించనున్నట్టు చెబుతున్నారు.

ఈ షెడ్యూల్ తో టాకీ పార్టు పూర్తవుతుంది. ఆ తరువాత పాటల చిత్రీకరణపై దృష్టిపెట్టనున్నట్టుగా సమాచారం. దాదాపు 300 కోట్ల రూపాయల బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. అనిరుధ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాకి హైలైట్ గా నిలుస్తుందని అంటున్నారు. జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాలో, ప్రతినాయకుడిగా సైఫ్ అలీ ఖాన్ కనిపించనున్నాడు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

YouTube
Instagram
Telegram
WhatsApp