180ml

300 కోట్ల క్లబ్‌లో హనుమాన్

ట్రెండ్ మారింది. పెద్ద హీరో, చిన్న హీరో అని తేడా లేదు. కంటెంట్ నచ్చితే చాలు దాన్ని ఆకాశానికి ఎత్తేస్తున్నారు నేటి ప్రేక్షకులు. ఏ సినిమాకి ఆ సినిమాగానే చూసే ట్రెండ్ వచ్చింది. అంతేకాదు ఫేవరేట్ హీరో సినిమాలను మాత్రమే చూస్తామనే ట్రెండ్ కూడా పోయి, కంటెంట్ బాగున్న సినిమాలను ఆదరించే ట్రెండ్ కొనసాగుతోంది.

అలాంటి ఒక ట్రెండ్ కారణంగానే ఈ మధ్య కాలంలో వచ్చిన చిన్న సినిమాలు సైతం పెద్ద విజయాలను అందుకుంటున్నాయి. ఆ జాబితాలో ఇటీవల చేరిన సినిమానే ‘హను మాన్’. హీరోగా ఒకటి రెండు సినిమాలు చేసిన తేజ సజ్జా, ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో ‘హను మాన్’ సినిమా చేశాడు. జనవరి 12వ తేదీన థియేటర్లకు వచ్చిన ఈ సినిమా, 100 కోట్ల క్లబ్ లోకి చేరడానికి మూడు రోజులకు మించి పట్టలేదు.

hanuman22

అలాంటి ఈ సినిమా నిన్నటితో 25 రోజులను పూర్తిచేసుకుంది. ఈ 25 రోజులలో ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 300 కోట్ల గ్రాస్ ను వసూలు చేసింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఈ సినిమా టీమ్ అధికారిక పోస్టర్ ను రిలీజ్ చేసింది. పాయింట్ చిన్నదే అయినా దానిని ఇంట్రెస్టింగ్ గా చెబితే పాన్ ఇండియా స్థాయిలో దూసుకుపోతుందనే సత్యాన్ని ఈ సినిమా మరోమారు నిరూపించిందని చెప్పచ్చు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

YouTube
Instagram
Telegram
WhatsApp