Allu Arjun: మూవీ లవర్స్ అత్యంత ఆతృతగా ఎదురు చూస్తున్న సినిమాల్లో “పుష్ప 2” ఒకటి. తాజాగా ఈ సినిమా సెట్స్ నుంచి “పుష్ప”రాజ్ క్రేజీ లుక్ లీక్ అయ్యింది. అల్లు అర్జున్ చీర కట్టుకుని కూర్చున్న ఈ పిక్ ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, లెక్కల మాస్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం “పుష్ప : ది రూల్”. ప్రస్తుతం ఇండియాలో రూపొందుతున్న పాన్ ఇండియా సినిమాల్లో బిగ్గెస్ట్ హైప్ ఉన్న మూవీగా “పుష్ప” టాప్ ప్లేస్ లో ఉంది. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో రూపొందిన “పుష్ప” మూవీకి సౌత్ నుంచి నార్త్ దాకా అన్ని వర్గాల ప్రేక్షకులు ఫిదా అయ్యారు. “పుష్ప 2″లో కూడా అల్లు అర్జున్ కు జోడిగా రష్మిక కనిపించనుంది.

ప్రస్తుతం “పుష్ప 2” షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ ఏడాది ఆగస్టు 15న మూవీని రిలీజ్ చేయడానికి మేకర్స్ ప్లాన్ చేశారు. తాజాగా “పుష్ప 2” షూటింగ్ సెట్స్ నుంచి పిక్ లీక్ కావడం అల్లు అర్జున్ అభిమానుల్లో గందరగోళాన్ని క్రియేట్ చేస్తోంది.“పుష్ప 2” మేకర్స్ కొంతకాలం క్రితం విడుదల చేసిన పోస్టర్ లో అల్లు అర్జున్ బీభత్సమైన అవతారంలో కనిపించి సినిమాపై అంచనాలను పెంచేశాడు. అదే క్రమంలో ఈ మూవీలో జాతరకు సంబంధించి ఒక భారీ యాక్షన్ సీక్వెన్స్ ఉంటుందని, దానికోసం భారీ సెట్టు వేశారని వార్తలు వచ్చాయి. ఈ హై వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్ లో ఓ భారీ సాంగ్ ఉంటుందని సమాచారం. అందులో భాగంగానే అల్లు అర్జున్ చీర కట్టుకుని కనిపిస్తాడని ప్రచారం జరిగింది.


