180ml

Nithin: రేపే నితిన్ ఫస్ట్ లుక్

Nitin: టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ కు గత కొంతకాలంగా సరైన హిట్ లేదు. అప్పుడెప్పుడో భీష్మ తో హిట్ కొట్టాడు. ఆ తరువాత మళ్లీ సరైన విజయం లేదు. దాంతో అదే డైరెక్టర్‌తో కలిసి సక్సెస్ ట్రాక్ ఎక్కాలని చూస్తున్నాడు. VNRTrio అనే వర్కింగ్ టైటిల్‌తో మొదలైన నితిన్, వెంకీ కుడుముల ప్రాజెక్ట్ ఆ తర్వాత.. VN2గా మారిపోయింది. ఎందుకంటే.. ముందుగా ఈ సినిమాలో హీరోయిన్‌గా రష్మికను అనుకున్నారు. కానీ రష్మిక డేట్స్ అడ్జెస్ట్ చేయలేక ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంది.nithin

 

అయినా ఇప్పటి వరకు మరో కొత్త హీరోయిన్ పేరు రివీల్ చేయలేదు. కానీ తాజాగా VN2 ప్రాజెక్ట్ నుంచి.. ‘అన్ మాస్కింగ్ ది కాన్ మాన్’ అంటూ అప్టేడ్ ఇచ్చారు మేకర్స్. జనవరి 26న ఉదయం 11:07 నిమిషాలకి ఫస్ట్ లుక్ రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా రిలీజ్ చేసిన ప్రీ పోస్టర్‌లో నితిన్ బ్యాగ్ తగిలించుకోని నిలబడి ఉన్నాడు. బ్యాక్ సైడ్ నుంచి ఈ ఫోటో ఉంది. దీంతో ఈ సినిమాలో వెంకీ కుడుముల ఎంటర్టైన్మెంట్తో పాటు కాస్త యాక్షన్ డోస్ కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది. మరి #VN2 నుంచి రానున్న ఫస్ట్ లుక్ పోస్టర్ ఎలా ఉండబోతుంది? నితిన్ ఈసారైనా హిట్ కొడతాడా లేదా? అనేది చూడాలి.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

YouTube
Instagram
Telegram
WhatsApp