180ml

NTR: దేవర పోస్ట్ పోన్.. క్లారిటీ

NTR: ఎన్టీఆర్ – కొరటాల శివ కాంబినేషన్లో ‘దేవర’ సినిమా రూపొందుతోంది. కల్యాణ్ రామ్ ఒక నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమా, చకచకా షూటింగు జరుపుకుంటోంది. అనిరుధ్ సంగీతాన్ని సమకూర్చుతున్న ఈ సినిమాతో, కథానాయికగా జాన్వీ కపూర్ పలకరించనుంది. ఈ సినిమాను ఏప్రిల్ 5వ తేదీన విడుదల చేయనున్నట్టుగా ప్రకటించారు.

story-1-1

అయితే ఇప్పుడు ఈ సినిమా ఆ తేదీకి థియేటర్లకు వచ్చే అవకాశం లేదనే ఒక టాక్ వినిపిస్తోంది. ఇంకా కీలకమైన భారీ సన్నివేశాల చిత్రీకరణ మిగిలే ఉండటం వలన, పాటలను కూడా చిత్రీకరించవలసి ఉన్నందున ఆ సమయానికి రిలీజ్ చేయడం కష్టమనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాను జూన్ లోనైనా లేదా ఆగస్టు 15వ తేదీనగాని విడుదల చేయాలనే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్టుగా ఒక టాక్ నడుస్తోంది. ఇందులో వాస్తవమెంతన్నది చూడాలి.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

YouTube
Instagram
Telegram
WhatsApp