180ml

గుంటూరు కారం రివ్యూ

చిత్రం: గుంటూరు కారం
నటీనటులు : మహేష్ బాబు, శ్రీ లీల, మీనాక్షి చౌదరి, రమ్య కృష్ణన్, ప్రకాష్ రాజ్, జయరామ్, జగపతి బాబు, రావు రమేష్, మీనాక్షి చౌదరి, ఈశ్వరి రావు, వెన్నెల కిషోర్ తదితరులు
దర్శకుడు: త్రివిక్రమ్ శ్రీనివాస్
నిర్మాత: నాగవంశీ, ఎస్. రాధా కృష్ణ
మ్యూజిక్ డైరెక్టర్: తమన్
సినిమాటోగ్రాఫర్: మనోజ్ పరమహంస
P. S. వినోద్
ఎడిటర్: నవీన్ నూలి
విడుదల తేదీ: 12 జనవరి 2024

సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకుడు త్రివిక్రమ్ కాంబినేషన్‌లో తెరకెక్కిన సినిమా గుంటూరు కారం. సంక్రాంతి కానుకగా ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఎన్నో అంచనాల నడుము విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుందో చూద్దాం.

కథ:

అనుకోని పరిస్థితుల కారణంగా వసుంధర (రమ్య కృష్ణన్) తన కొడుకు రమణ (మహేష్ బాబు), భర్త సత్యం (జయరామ్)ని విడిచిపెడుతుంది. చిన్నప్పుడు తల్లి ఎందుకు వదిలేసిందో రమణకు తెలీదు. తండ్రి రాయ‌ల్ స‌త్యం (జ‌య‌రామ్‌) జైలు పాల‌వ్వ‌డంతో ర‌మ‌ణ‌ను అత్త‌య్య (ఈశ్వ‌రీరావు) పెంచి పెద్ద‌చేస్తుంది. రాయల్ సత్యానికి దూరమైన వసుధార మరో పెళ్లి చేసుకుంటుంది. గొప్ప రాజ‌కీయ‌నాయ‌కురాలిగా ఎదుగుతుంది. వ‌సుంధ‌ర‌ను మినిస్ట‌ర్‌ను చేయాల‌ని ఆమె తండ్రి వైరా వెంక‌ట సూర్యానారాయ‌ణ (ప్ర‌కాష్ రాజ్‌) ప్ర‌య‌త్నిస్తాడు. మినిస్ట‌ర్ ప‌ద‌విపై ఆశ ఉన్న మ‌రో పొలిటిక‌ల్ లీడ‌ర్‌ కాటా మ‌ధు (ర‌విశంక‌ర్‌)…వ‌సుంధ‌ర‌కు ప‌ద‌వి ద‌క్క‌కూడ‌ద‌ని రాయ‌ల్ స‌త్యంతో ఆమె పెళ్లి, ర‌మ‌ణతో బంధుత్వాన్ని బ‌య‌ట‌పెట్టాల‌ని చూస్తాడు. త‌ల్లితో త‌న‌కు ఎలాంటి సంబంధం లేద‌ని బాండ్‌పేప‌ర్స్‌పై ర‌మ‌ణ చేత సంత‌కం చేయించాల‌ని వైరా సూర్య‌నారాయ‌ణ అత‌డిని గుంటూరు నుంచి హైద‌రాబాద్‌కు పిలిపిస్తాడు. పేప‌ర్స్‌పై సంత‌కం చేయ‌డానికి ర‌మ‌ణ ఒప్పుకోక‌పోవ‌డంతో అత‌డిపై త‌ప్పుడు కేసులు పెట్టిస్తాడు. ఆ త‌ర్వాత ఏమైంది? ర‌మ‌ణ‌కు త‌ల్లి వ‌సుంధ‌ర దూరం కావ‌డానికి కార‌ణ‌మేమిటి?

విశ్లేషణ:

సినిమా ప్రారంభ సన్నివేశాలను చూస్తే కథలో చాలా ఎమోషన్స్ ఉండబోతున్నాయి అనిపిస్తుంది. ఇక ఫ్యాన్స్ పండుగ చేసే మహేష్ బాబు ఎంట్రీ చాలా సింపుల్‌గా ఉంటుంది. కథలో మెయిన్ థీమ్ తల్లీ కొడుకుల సెంటిమెంటే కాబట్టి ఆ సన్నీవేశాల కోసం మొదటి నుంచి చాలా సెటప్ చేశారు. కానీ ఫే ఆఫ్ ఇవ్వడంలో అంత వర్క్ అవుట్ కాలేదు. వసుంధర తన కొడుకును ఎందుకు వదిలి వెళ్లాల్సి వచ్చిందో చెప్పే సీన్లు బలంగా లేవు. నిజానికి వసుంధర క్యారెక్టర్‌కు చాలా వెయిట్ ఉంది. దాన్ని తెరపై చూపించడంలో గురూజి లెక్క తప్పింది. పంచుల ప్రసాలతో ఈలలు, చప్పట్లు కొట్టించ వచ్చు కానీ ఎమోషన్ పండించాలంటే సరైనా సీన్లు పడాల్సిందే. అదే మిస్ అయింది. హీరోయిన్ శ్రీలలను గ్లామరస్‌గా చూపించారు. ఫస్ట్ ఆఫ్‌లో మ్యాషప్ సాంగ్స్‌కిి, క్లైమాక్స్‌లో కుర్చీ సాంగ్‌కి డ్యాన్స్ కుమ్మేసింది. కానీ పర్ఫార్మెన్స్ చేయడానికి స్కోప్ లేని పాత్ర. ఓల్డ్ కాన్సెప్ట్.. హీరోచే సంతకం చేయించడానికి గుంటూరు వచ్చి నానా పాట్లు పడుతుంది.

సెకండ్ హీరోయిన్ మీనాక్షీ చౌదరి ఎందుకు నటించింది అంటే అంత తొందరగా సమాధానం చెప్పలేము. ఏదో నటించింది అంటే. త్రివిక్రమ్ సినిమా క్లైమాక్స్‌లు ఎలా ఉంటాయో తెలిసిందే. హృదయాన్ని బరువెక్కించే సన్నివేశాల్లో కంటతడి పెట్టే సంభాషణలు. అవేవి వర్క్ అవుట్ కాలేదు. వసుంధర రమ్య కృష్ణ మాట్లాడుకుంటే చూడాలని ఎదురు చూసే ప్రేక్షకులకు నిరాశే మిగిలుతుంది. చాలా చిన్న చిన్న డైలాగ్‌లతో తేల్చేశాడు. తల్లి లేక తన పడిన వేదన, కొడుకును దూరం చేసుకొని తాను చేస్తున్న యుద్ధం తాలుకు ఎమోషన్ మిస్ అవడం ఈ సినిమాకు పెద్ద డ్రాబ్యాక్ అని చెప్పవచ్చు.

reviw

ఎవరెలా చేశారు:

మహేష్ బాబు యాక్టింగ్ గురించి చెప్పడానికి ఏం ఉంటుంది. ఎమోషనల్ సీన్లలో, కామిడీ టైమింగ్‌లో, పంచులు చెప్పడంలో ఆయనకు సపరేటు రూట్ ఉంది. ఈ సినిమాలో గుంటూరు యాస కూడా కలిసొచ్చింది. జయరాజ్ తనకు అలవాటు అయిన ఎప్పుడూ సంఘర్షనలో ఉండే పాత్రే ఇందులో చేశారు. రమ్యకృష్ణ పాత్రకు చాలా ప్రాధాన్యత ఉంది. కానీ స్క్రీన్ స్పేస్ తక్కువుంది. ప్రకాశ్ రాజ్ గ్రే షేడ్స్ ఉన్న క్యారెక్టర్ చేయడంలో ఆయన్ను కొట్టేవారు లేరు. ఇందులో కూడా అదే పాత్ర. ఈశ్వరీ రావు, వెన్నెల కిశోర్, జగపతి బాబు, మీనాక్షీ చౌదరి మిగితా నటీనటులు వారిపాత్రల మేరకు ఓకే అనిపించుకున్నారు.

రేటింగ్: 2.5/5

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

YouTube
Instagram
Telegram
WhatsApp