180ml

అయ్యో.. నయనతార అన్నపూర్ణి చిత్రం నెట్ ఫ్లిక్స్ నుంచి ఔట్:Nayanthara

Nayanthara: లేడీ సూపర్ స్టార్ నయనతార నటించిన అన్నపూర్ణి చిత్రం వివాదాల్లో చిక్కుకుంది. ఈ సినిమా గత కొన్నిరోజులుగా ప్రముఖ ఓటీటీ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని జీ స్టూడియోస్ సంస్థ తెరకెక్కించింది. ఇప్పుడు ఈ సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. నెట్ ఫ్లిక్స్ నుంచి ఈ చిత్రాన్ని తొలగించినట్లు ప్రకటించింది. నయనతార 75వ చిత్రంగా తెరకెక్కిన ఈ అన్నపూర్ణి గత నెలలో నెట్‌ ఫ్లిక్స్‌ ఓటీటీలో విడుదల అయింది. ఈ నేపథ్యంలో మాజీ శివసేన నాయకుడు రమేష్ సోలంకి ఈ చిత్రాన్ని హిందూ వ్యతిరేకి అని విమర్శించారు. ఈ సినిమాలో రాముడ్ని కించపరిచే సన్నివేశాలు, ఉన్నాయంటూ … దీనిపై ముంబయి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ సినిమా “లవ్ జిహాద్”ను బలపరిచేలా ఉందని సోలంకి ఆరోపణలు చేశారు.

nayanatara

రెండు రోజుల క్రితం.. విశ్వహిందూ పరిషత్ నాయకుడు శ్రీరాజ్ నాయర్ కూడా రాముడిపై కించపరిచే వ్యాఖ్యలను ఖండించారు. ఈ సినిమాలో రాముడిని, అతన్ని మాంసం తినేవాడు అని ముద్ర వేశారంటూ విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలోనే చిత్ర నిర్మాణ సంస్థ జీ స్టూడియోస్ ఓటీటీ స్ట్రీమింగ్‌ నుంచి తొలగించింది. మత విశ్వాసాలను దెబ్బతీయాలనే ఉద్దేశం తమకు లేదని వివరణ తెలిపింది. తమ సినిమా ఎవరినైనా ఇబ్బంది పెట్టి ఉంటే క్షమపణలు కొరింది. మరి కొత్త వర్షన్ అన్నపూర్ణి ఎప్పుడు స్ట్రీమింగ్ కానుంది.. అనే వివరాలుపై క్లారిటీ రావాల్సి ఉంది. ఇక ఈ సినిమాను తొలగించడంపై నయనతార ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. సినిమాను సినిమాలాగే చూడాలంటూ కామెంట్స్ పెడుతున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

YouTube
Instagram
Telegram
WhatsApp