180ml

నా సామిరంగ ట్రైలర్ విడుదల.. ఎలా ఉందంటే

Nagarjuna: ఈ పండక్కి సంక్రాంతి బరిలో టాలీవుడ్ కింగ్ నాగార్జున నటించిన నా సామిరంగ ఉంది. ఇయన సరసన ఆషికా రంగనాథ్ నటిస్తోంది. ఈ చిత్రంలో అల్లరి నరేష్, రాజ్ తరుణ్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఇక వీరికి జోడిగా మిర్నా మీనన్, రుక్సార్ థిల్లాన్ నటిస్తున్నారు. డ్యాన్స్ మాస్టర్ విజయ్ బిన్నీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం జనవరి 14న ప్రేక్షకుల ముందుకు వస్తుంది. తాజాగా నా సామిరంగ ట్రైలర్ విడుదల అయింది.

MV5BOWE5YjhiM2YtNDhmMi00MzgxLWI2YzItYjcwNTJiZDY4MGQ0XkEyXkFqcGdeQXVyMTU0OTAzMDcw._V1DueULMq

రెండు గ్రామల మధ్య ఉండే గొడవల నేపథ్యంలో స్నేహం, ప్రేమ, రివెంజ్ డ్రామాతో ఈ చిత్రం సాగుతుందని ట్రైలర్ చూస్తుంటే అర్థం అవుతుంది. కిష్టయ్య పాత్రలో నాగార్జున, అంజి పాత్రలో అల్లరి నరేష్ పాత్రలు ఆకట్టుకునేలా ఉన్నాయి. ఇక పల్లేటూరి గెటప్ లో వరలక్ష్మి పాత్రలో ఆషికా రంగనాథ్ కూడా చూడముచ్చటగా ఉంది. ఈ మూవీ మలయాళ సూపర్ హిట్ మూవీ పోరింజు మరియం జోస్ చిత్రానికి రీమేక్ అన్న విషయం తెలిసిందే. ఈ సారి పండక్కి ఎలాగైనా హిట్ కొట్టాలని నాగార్జున ఫిక్స్ అయ్యారు. అందుకే యాక్షన్ మసాల ఉండే లా ప్లాన్ చేసుకున్నారు. ట్రైలర్ నాగార్జున్ స్వాగ్, మ్యానరిజమ్ చాలా బాగుంది. అలాగే ఆయన చెప్పే ఈ పండక్కి నా సామిరంగ అనే డైలాగ్ కూడా చాలా క్యాచీగా ఉంది. మొత్తానికి నా సామిరంగ పక్కా ఫ్యామిలీ మూవీ అని తెలుస్తుంది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

YouTube
Instagram
Telegram
WhatsApp