Ileana D’Cruz: టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇలియాన అంటే ఒకప్పుడు మాములు క్రేజ్ ఉండేది కాదు. తన నడుము అందాలతో కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేసేది. వరుస సినిమాల్లో నటించి సడెన్ గా మాయం అయింది. సౌత్ నుంచి నార్త్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈ బ్యూటీ.. మొదట్లో మంచి హిట్లతో అలరించింది. ఆ తరువాత అక్కడ కూడా కనుమరుగైంది. ఆ తరువాత కొన్నాళ్లకు తాను ప్రెగ్నెన్సీ అన్న సంగతి బయటపెట్టింది. ప్రెగ్నెన్సీ ఫోటోలను షేర్ చేస్తూ తన సంతోషాన్ని అభిమానులతో పంచుకుంది. కానీ భర్త గురించి చెప్పలేదు. గతేడాది ఇలియానా పండంటి మగబిడ్డకు జన్మించింది. తన కొడుకు పేరు కోవా ఫీనిక్స్ డోలన్ అని చెబుతూ తన కొడుకు ముఖాన్ని చూపించింది. తన బాబుతో ప్రస్తుతం గడుపుతున్న హ్యాపీ లైఫ్ గురించి సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు పోస్ట్ చేస్తుంది. కానీ తన భర్త గురించి ఏమి చెప్పలేదు. దీంతో తన భర్త గురించి తన అభిమానులు నెగిటీవ్ గా మాట్లాడారు. తాజాగా తన భర్త ఫోటోను షేర్ చేస్తూ.. అతడి పేరు మైఖేల్ డోలన్ అని తెలిపింది. అంతకుమించి అతడి గురించి ఏ విషయం బయటకు రానివ్వలేదు.



ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఇలియాన మైఖేల్ గురించి ప్రస్తావించింది. తాను జీవితంలోకి వచ్చినందుకు సంతోషంగా ఉందని వెల్లడించింది. అతడు అద్భుతమైన భాగస్వామి అని తెలిపింది. కొడుకు పుట్టిన తర్వాత నాకు ఇంట్లో మంచి సపోర్ట్ లభించింది. నన్ను, నా కుమారుడిని వైద్యులు బాగా చూసుకున్నారు. నా బాబు వేరే గదిలో.. నేను మరో గదిలో ఉండడంతో చాలా ఏడ్చాను. ఆ సమయంలో నా భర్త మైఖేల్ నాకు తోడుగా ఉన్నాడు. నన్ను విశ్రాంతి తీసుకోవాలని చెప్పి.. బాబును తనే దగ్గరుండి చూసుకున్నాడు. మైఖేల్ నా జీవితంలోకి రావడం నా అదృష్టం. నేను ఏమి చెప్పకుండానే నాకు కావాల్సినవి అన్ని చేస్తాడు. అతడు అధ్భుతమైన భాగస్వామి అయినందుకు నేను కృతజ్ఞురాలిని” అంటూ చెప్పుకొచ్చింది ఇలియానా.


